»   » "బూతు" మార్క్ పోగొట్టుకునేందుకు తపన పడుతున్న మారుతి

"బూతు" మార్క్ పోగొట్టుకునేందుకు తపన పడుతున్న మారుతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదట్లో మారుతీ అంటే చాలు ఈరోజుల్లో, బస్టాప్ లాంటి అడల్ట్ జోకుల సినిమాలే గుర్తొచ్చేవి. విమర్షకులు మారుతి అనే పేరు వింటేనే తిట్టతనికి ఇక ఇంట్రస్టింగ్ టాపిక్ అన్నట్టు చూసేవాళ్ళు. మొదట్లో అలవాటయ్యిందేమో తర్వాత కాస్త బానే ఉన్నాయి అనిపించుకున్నా "ప్రేమకథాచిత్రం", "లవర్స్" లాంటి సినిమాలలో కూడా కాసిన్ని డబుల్ మీనింగ్ డైలాగులు పడేసాడు మారుతి.

తర్వాత కొత్తజంటతో అందరూ కోరుకున్నట్టే క్లీన్ సినిమా తీసాడు కానీ అది కాస్తా బాక్సాఫీస్ దగ్గర నిలబలేదు.దాంతో మారుతికి బూతు ఉంటే తప్ప సినిమా చేయటం రాదంటూ విమర్శలు గుప్పించారంతా.. అయితే పోయిన సంవత్సరం నానితో "భలేభలే మగాడివోయ్" రూపంలో క్లీన్ యు సర్టిఫికేట్ సినిమా తీసి.. బ్లాక్ బస్టర్ చేసి చూపించాడు మారుతి.

Maruthi

ఈ సినిమా చూసిన వాళ్లంతా.. నిజంగా ఇది తీసింది మారుతినేనా అని షాకయ్యారు. తానేమిటో నిరూపించుకున్న మారుతి ఇక తన తదుపరి గమ్యం వైపు తిరిగాడు. పెద్ద దర్శకుడు అనిపించుకోవాలంటే పెద్ద హీరోతో నే హ్యాడిల్ చేసి చూపించాలి ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ తో బాబు బంగారం చేస్తున్నాడు మారుతి. ఈ సినిమా కూడా క్లీన్ సినిమాగానే కనిపిస్తోంది. ఎందుకంటే చిన్న హీరోలతో ఓకే నే గానీ వెంకటేష్ లాంటి అగ్రహీరోతో బూతో బూతు డైలాగుల వ్యవహారం సాగదు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా ఎలా ఉండ బోతుందో తెలుస్తోంది. ఇంకో మంచి కామెడీ క్లీన్ ఎంటర్టైనర్ ని అదించబోతున్న్నాడన్న విశయం అర్థమైపోయింది. బాబు బంగారం టీజర్ ఇంకో నాలుగు రోజుల్లో (జూన్ 6న) విడుదల కానుంది. చూడాలి మరి.. బాబు బంగారం తర్వాత మారుతి ఎలాంటి ప్రశంసలని పొందుతాడో..

English summary
Maruti who is mostly popular for his adult comedies, Now he is Trying to focus himself as Clean Director
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu