»   » మణితో నాగార్జున - సంజయ్ దత్ ‘నాక్ అవుట్’

మణితో నాగార్జున - సంజయ్ దత్ ‘నాక్ అవుట్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

16 డిసెంబర్, రుద్రాక్ష్ వంటి చిత్రాలను మలిచిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మణి శంకర్ త్వరలో 'నాక్ అవుట్" పేరుతో తన తదుపరి చిత్రాన్ని ఆరంభించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ చిత్రంలో నాగర్జున సంజయ్ దత్ హీరోలుగా నటిస్తారంటూ ఇటీవల మణిశంకరే స్వయంగా ప్రకటించగా నాగ్ మాత్రం ఇప్పటి వరకూ ఈ అంశాన్ని దృవీకరించకపోవడం గమనార్హం.

నాగార్జున తాజా చిత్రం 'గగనం" ఓవైపు రిలీజ్ కి రెడీ అవుతుండగా మరోవైపు..రగడ, రాజన్న, ఆర్. ఆర్ మూవీమేకర్స్ చిత్రాలతో పాటు తమిళంలో అజిత్-వెంకట్ ప్రభుల సినిమాకీ ఆల్ రెడీ కమిటై వున్న నాగ్ ఈ బిజీలో మణి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..తన ఆప్త మిత్రుడైన సంజయ్ దత్ కోసం ఆ చిత్రంలో నటిస్తారా అనేది వేచి చూడాల్సిందే...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu