»   » మళ్ళీ నిర్మాతగా నాని?: "చేప" తీసి మళ్ళీ చేతులు కాల్చుకుంటాడా?

మళ్ళీ నిర్మాతగా నాని?: "చేప" తీసి మళ్ళీ చేతులు కాల్చుకుంటాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాని విభిన్నపాత్రలు పోషించేందుకు ఎపుడూ ముందుంటాడు ఆ ప్రయత్నం లో తెరమీద ఎంత సేపు కనిపిస్తాను అన్నది కూదా పట్టించుకోడు. నాని కి కావాల్సిందల్లా రొటీన్ కి భిన్నంగా అనిపించే ఒక పాత్ర అదీ తాను మాత్రమే చేయగలను అన్నంత యూనిక్ గా అతనికి అనిపించాలి. గతంలో దర్శకధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని "ఈగ" పాత్రను పోషించారు. ఈ చిత్రంలో స‌మంత, సుదీప్ ప్ర‌ధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించింది.

ఈగ

ఈగ

ఈగ ప్రేరుతో ఈగ నే నాని గా చూపిస్తూ... విజువల్ ఎఫెక్ట్స్‌తో తీసిన రివెంజ్ డ్రామా ప్రేక్షకులకు ఎంతలా చేరువైందో ప్రత్యేకంగా చెప్పేదేముంది..? ఈగ సినిమా క్రియేట్ చేసిన ఉత్సాహమో ఏమో కానీ.. ఆ తర్వాత పందిపిల్లను హీరో చేశాడు విలక్షణ డైరెక్టర్ రవిబాబు. ‘అదుగో' పందిపిల్ల హీరో అనిపించబోతున్నారు.చేప

చేప

ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయింది ‘చేప'. ఈగ సినిమాలో హీరోయిన్ ని ప్రేమించిన నానిని విలన్ చంపేస్తే.. ఈగ రూపంలో మళ్లీ జన్మించి విలన్ పై ప్రతీకారం తీర్చుకుంటాడు. పూర్తిస్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా

ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా

సరే అసలు విషయానికొస్తే.. ఈగ సినిమాలో ఈగగా అవతారమెత్తిన నాని త్వరలో చేప అవతారమెత్తనున్నాడటా.. ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఓ చిత్రంలో నాని కథానాయకుడు. ఈ చిత్రం పూర్తిగా చేప నేపథ్యంలో రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు టాక్‌. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని సైతం రూపొందించారు.చేప కోసం

చేప కోసం

రాజమౌళి కోసం ‘ఈగ'గా మారిపోయిన నాని.. ‘చేప' కోసం నిర్మాతగా మారిపోయారని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ శర్మ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాను తీస్తున్నాడట. ఇటీవలే నానిని కలిసిన ప్రశాంత్ స్టోరీ లైన్‌ను వినిపించారని, అది నానికి తెగ నచ్చేసిందని నాని సన్నిహితులు చెబుతున్నారు.కథ నానికి బాగా నచ్చింది

కథ నానికి బాగా నచ్చింది

‘చేప' ప్రధానంగా రూపొందే ఈ సినిమా కథ నానికి బాగా నచ్చిందని, అందుకే వెంటనే సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. అయితే ఈ సినిమాలో చేప గా నాని ఉంటాడా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు కానీ ఇప్పుడు నాని అంటే జనాల్లో క్రేజ్ ఉంది నాని కి నచ్చిన కథ అంటే ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తారు.పైసా, జండాపై కపిరాజు

పైసా, జండాపై కపిరాజు

అయితే గతం లో కూడా కెరీర్ మంచి స్పీడ్ లో ఉన్నప్పుడు ఇలాగే నిర్మాత అవుదామని పైసా, జండాపై కపిరాజు లాంటి సినిమాలని నెత్తికెత్తుకొని పాతాళానికి పడి పోయాడు నాని. అసలు కెరీర్ ప్రశ్నార్థకం అనుకుంటున్న సమయం లో ఎవడే సుబ్రహ్మణ్యం వచ్చి రక్షించింది. ఈ సారైనా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడేమో చూడాలి.

English summary
Hero Nani to turn producer again for his New Project Chepa? this is the News roming in film nagar circles
Please Wait while comments are loading...