»   » ఇంకా సైలెంట్ గానే ఉన్నాడు...! ఎన్టీఆర్ ప్లాన్ ఏంటో ఇవాళైనా చెప్తాడా?

ఇంకా సైలెంట్ గానే ఉన్నాడు...! ఎన్టీఆర్ ప్లాన్ ఏంటో ఇవాళైనా చెప్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి అందగాడు కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం. కళ్యాణ్ రామ్ సరికొత్త మేకోవర్ లో కనిపిస్తున్న ఈ సినిమాను ముందుగా దసరా బరిలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అనుకున్నట్టుగా షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు దసరా బరిలో భారీ కాంపిటీషన్ ఏర్పడటంతో ఇజం రిలీజ్ వాయిదా పడింది. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే మోస్ట్‌ పవర్‌ఫుల్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ డిఫరెంట్‌ లుక్‌తో కనిపించబోతున్నారు. కళ్యాణ్‌రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌, పూరి జగన్నాథ్‌ టేకింగ్‌ హైలైట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చెయ్యడానికి సిద్ధమవుతోంది.

Is NTR will announce his Next project with puri??

ఈరోజు సాయంత్రం ఇజం ఆడియో విడుదల కానుంది. ఇప్పుడు అందరి కళ్ళూ అటువైపే ఇజం అడియో ఫంక్షన్ వంక ఎన్టీఆర్ అభిమానులు ఆశగా చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూసేది కేవలం ఆడియో కోసమే కాదు ఇదే వేదిక మీద ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రకటన చేయనున్నాడనే వార్త కూడా దీనికి కారణం. కానీ అలాంటి పనేదీ ఈ ఫంక్షన్ లో జరిగే అవకాశాల ఫిఫ్టీ, ఫిఫ్టీ అని తెలుస్తోంది. పూరి కథ ను రెడీ చేసాడు కానీ, ఇంకా ఎన్టీఆర్ కు నెరేషన్ ఇవ్వలేదు. లైన్ మాత్రమే ఓకె అయింది.

పూర్తి కథ విని ఓకే అంటే గానీ ముందుకు సాగదు. అంటే ఈ రోజు సాయంత్రం కొత్త సినిమా ప్రకటన ఉండే అవకాశాలు తక్కువే. ఎవరైనా బ్యాంకాక్ వెళ్తే ఏ ఎలక్ట్రికల్ సామాన్లో, లిక్కరో ఇంకేవైనా తెచ్చుకొస్తారు. కానీ దర్శకుడు పూరి జగన్నాధ్ కథ పట్టుకువస్తాడు. ఆయనకు అక్కడి ఏంబియన్స్ వుంటే తప్ప కలం కదలదు..మెదడు చురుగ్గా పనిచేయదు. కథ చకచకా ముందుకు కదలదు. అదే అక్కడికి వెళ్తే, ఇలా దుకాణానికి వెళ్లి అలా కొనుక్కు వచ్చినట్లు, కథ తయారైపోతుంది. అనుకున్నట్టే కథ రెడీ అయ్యింది కూడా..

ఈ కథ అయిపోయిందా.. ఎన్టీఆర్ట్స్ బ్యానర్ లో సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి స్టార్ట్ అయిందో, పూరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ కదా..నాలుగైదు నెలల్లో సినిమా రెడీ అయిపోతుంది. అంటే కథ ఓకె కావాలి అది ఒక్కటే సమస్య అన్నమాట. రెండు రోజులు ఆగితే తెలిసిపోతుంది.అసలు సినిమా ఉందాలేదా... ఇంటే ఎప్పుడు ఉంటుందీ అని మరి సాయంత్రం దాకా ఎదురు చూడాల్సిందే.

English summary
Is NTR will announce his Next project with puri jagannath in "ISM" audio function on this evening
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu