Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్ హాలీవుడ్ చిత్రానికి పనిచేస్తున్నారా?
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇక హాలీవుడ్ వారిని కూడా అలరించనుందని నిర్మాత కొండా కృష్ణం రాజు మీడియాకు చెప్పారు. ఇంతకీ హాలీవుడ్ లో ఏ చిత్రానికి దేవి సంగీతం అందిస్తున్నాడూ అంటే...ఇటీవలే..జెరూసలెం లో ప్రారంభమైన జీసస్ క్రైస్ట్ చిత్రానికిట. సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో ఆదిత్య ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రమది. ఇక ఈ విషయాన్ని కృష్ణంరాజు ..మీడియా వారికి తెలియచేస్తూ... ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు ఆరాధించే ఏసుక్రీస్తు సినిమా ద్వారా హాలీవుడ్‌లో దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ మొదలు కావడం మంచి పరిణామం. ఇది హిందీలోనూ తెరకెక్కుతోంది. కాబట్టి దేవిశ్రీ ఒకేసారి హాలీవుడ్, బాలీవుడ్‌లకు వెళ్తున్నారు. ఆయన చక్కటి బాణీలిచ్చారని చెప్పారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో బాటు ఈ చిత్రం ఇంగ్లీష్ లోనూ రూపొందుతోంది కాబట్టి...ఇది హాలీవుడ్ చిత్రం అని అంటున్నారు. నిర్మాత గారు చెప్పేదాన్ని బట్టి రచయిత జె.కె.భారవి, దర్శకుడు సింగీతం, నిర్మాతగా ఆయన, మిగతా టెక్నీషన్స్ అంతా కూడా హాలీవుడ్ చిత్రానికి పనిచేస్తున్నట్లే కదా. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా హాలీవుడ్ చిత్రం చేస్తున్నట్లేకదా..అదీ విషయం.