»   » పవన్ కళ్యాణ్ 'మాఫియా డాన్' గా మార్చబోతున్నది ఎవరంటే...!?

పవన్ కళ్యాణ్ 'మాఫియా డాన్' గా మార్చబోతున్నది ఎవరంటే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ పులి ఫైయిల్ అవ్వడంతో చాలా స్పీడ్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. త్వరగా స్ర్కిప్ట్ వినడం త్వరత్వరగా షూటింగ్స్ లో పాల్గొనడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కొద్ది ఆల్ రెడీ, జీసస్ క్రీస్ట్ గా, తర్వాత జయంత్ దర్శకత్వంలో "ఖుషిగా" రీసెంట్ గా వివి వినాయక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ గా నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో 'బిల్లా" లాంటి స్టయిలిష్ ఫిలిం తీసిన విష్ణు వర్థన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఐదేళ్ల క్రితం 2005లో రూపొందిన 'బాలు" చిత్రంలో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ కు అసిస్టెంట్ గా చేశాడు. ఇప్పుడు ఏకంగా విష్ణువర్థన్ పవర్ స్టార్ ను డాన్ గా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. తమిళ 'బిల్లా" లో అజిత్ ను 'డాన్" గా అద్భుతంగా చూపించాడు. ప్రస్తుతం బిల్లా2 చిత్రీకరిస్తున్నాడు విష్ణువర్థన్. సో. పవన్ కళ్యాణ్ ని కూడా పవర్ ఫుల్ డాన్ గా చూసిస్తాడని ఊహించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే..ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ జె సూర్య కథ అందిస్తున్నాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu