»   »  సెక్సీగా బరితెగింపు, డేంజర్లో హీరోయిన్ కెరీర్!(ఫోటోలు)

సెక్సీగా బరితెగింపు, డేంజర్లో హీరోయిన్ కెరీర్!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : కాంట్రవర్సీ మోడల్‌గా పాపులారిటీ సంపాదించిన పూనమ్ పాండే త్వరలో బాలీవుడ్ మూవీ 'నషా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతోంది. తొలి ప్రయత్నంలోనే సంచలనం క్రియేట్ చేయాలనే ఉబలాటంతో ఈ చిత్రంలో బరితెగింపుగా, విచ్చలవిడిగా తన సెక్సీ అందాలను ఆరబోసింది పూనమ్ పాండే.

అయితే పూనమ్ బరితెగింపు పోకడలపై దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఆమె అర్ధనగ్న పోస్టర్లను నిరసన కారులు ముంబైలో తగులబెట్టారు. అదే విధంగా ఈశాన్య ఢిల్లీలోనూ ఆమె పోస్టర్లను చించేసారు ఆందోళన కారులు. ఈసందర్భంగా మాట్లాడుతూ...పూనమ్ పాండే నగ్న పోస్టర్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, ముఖ్యంగా పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి సినిమాలను అనుమతించబోమని తెలిపారు.

ఈఆందోళన కార్యక్రమాలపై పూనమ్ పాండే షాక్ అవుతోంది. కేవలం తన అభిమానులను ఎంటర్టెన్ చేయడానికే ఇలా బోల్డ్ అండ్ సెక్సీగా నటించినట్లు చెబుతోంది. ఏది ఏమైతేనేం.....పరిస్థితి చూస్తుంటే పూనమ్ పాండే సినీరంగ ప్రవేశం వివాదాస్పదం అయింది. ఈ పరిణామాలు ఆమె కెరర్‌కు డేంజర్ గా మారాయి. మరి ఈ గొడవలు ఆమె కెరీర్‌ను ఎలా మలుపుతిప్పుతాయో చూడాలి.

స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

పోస్టర్ తగలబెడుతున్న దృశ్యం

పోస్టర్ తగలబెడుతున్న దృశ్యం


ఇటీవల ముంబైలో ఆందోళన‌కారులు పూనమ్ పాండే పోస్టర్లు తగులబెడుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. పూనమ్ పాండే లాంటి మోడల్స్ బరితెగింపు కాణంగా సమాజంలోకి చెడు పోకడలు ప్రవేశిస్తాయని ఆందోళన కారులు అంటున్నారు. ఇలాంటి వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.

పబ్లిసిటీ కోసం మరింత సెక్సీగా...

పబ్లిసిటీ కోసం మరింత సెక్సీగా...


పూనమ్ పాండే నటించిన తొలి సినిమా ‘నషా' ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమాకు పబ్లిసిటీ పెంచడానికి ఇప్పటికే రకరకాల గిమ్మిక్కులు ప్రదర్శించిన పూనమ్ పాండే తాజాగా తన న్యూడ్ ఫోటోను లీక్ చేసి మీడియాలో చర్చనీయాంశం అయింది.

టెక్నీషియన్స్ వివరాలు

టెక్నీషియన్స్ వివరాలు


నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మిస్తున్నారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన ‘జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం. నషా కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు.

సమాజసేవే అంటోంది

సమాజసేవే అంటోంది


తాను చిన్ని చిన్న దుస్తులు వేసుకుని ఎక్స్ ఫోజింగ్ చేయడాన్ని తప్పుగా భావించడం లేదని, ఇది కూడా ఒక రకంగా సమాజ సేవ అని అంటోంది. నన్ను ఇలాంటి డ్రెస్సుల్లో చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ సోషల్ సర్వీసే అని వాదిస్తోంది.

కథేమిటంటే..

కథేమిటంటే..


‘నషా' చిత్రం 18 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానుల్లో ఎన్నో ఆశలు రేపుతోంది. పూనమ్ పాండే పలు సీన్లలో నగ్నంగా నటించడంతోపాటు పడకగది శృంగార సీన్లలో ఇరగదీసినట్లు ఈ ట్రైలర్లో చూపించారు. ఇక సినిమా ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జులై 26న ఈచిత్రం విడుదల కాబోతోంది.

English summary

 India's controversial model Poonam Pandey, who is all set to make her Bollywood debut with the film Nasha, has recently got into trouble for her bold acts. Reportedly, her new movie Nasha's bold posters have created furore in many parts of the nation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu