»   » బూర్జ్ ఖలీఫాపై ప్రభాస్.. కరణ్ జోహర్‌కు బాహుబలి షాక్.. ఏం జరుగుతుందంటే..

బూర్జ్ ఖలీఫాపై ప్రభాస్.. కరణ్ జోహర్‌కు బాహుబలి షాక్.. ఏం జరుగుతుందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రభాస్‌కు పెరిగిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నిర్మాతలు ఆయన ముందు క్యూ కడుతున్నారు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్‌ నిర్మాణ సారథ్యంలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ జరుగుతుందనే వార్త జాతీయ మీడియాల్లో గుప్పుమన్నది. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వంలోనే ప్రభాస్ హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నాడంటూ రూమర్లు చెలరేగాయి. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ తాజాగా ప్రభాస్‌తో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు ఓ జాతీయ వార్త వెబ్‌సైట్ కథనం రాసింది. ఆ కథనంలో ఏముందంటే

ప్రభాస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి..

ప్రభాస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి..

బాహుబలి2 తర్వాత ప్రభాస్ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు ఎగబట్టారు. కరణ్ జోహార్‌తో సినిమా దాదాపు ఖారారైంది. చివరి నిమిషంలో ఏదో కారణంగా అది మూలన పట్టది. ప్రస్తుతం ప్రభాస్‌, నిర్మాత సాజిద్ నడియావాలా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సంప్రదింపులు కూడా ఫైనల్‌కు చేరుకొన్నాయనే మాట బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. అయితే వీరివురూ కూడా ఈ వ్యవహారంపై పెదవి విప్పడం లేదు.


ప్రభాస్ ముంబైలో మకాం..

ప్రభాస్ ముంబైలో మకాం..

గత కొద్ది రోజులుగా ప్రభాస్ ముంబైలో మకాం పెట్టారు. సాహో చిత్రం షూటింగ్ ముంబైలో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ముంబైలో ప్రత్యేకంగా ఓ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా ప్రభాస్ ముంబైలోనే ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో చాలా మంది బాలీవుడ్ నిర్మాతలు కలిసినట్టు సమాచారం.


బూర్జ్ ఖలీఫాపై సాహో షూటింగ్

బూర్జ్ ఖలీఫాపై సాహో షూటింగ్

సాహో చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణను వేగవంతం చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లను దుబాయ్‌లోని ప్రతిష్ఠాత్మక బహుళ అంతస్థులు కట్టడం బుర్జ్ ఖలీఫాపై చిత్రకరించనున్నారనేది తాజా సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్‌ను జూలై మొదటివారంలో బూర్జ్ ఖలీఫాపై జరిపే అవకాశముంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ కట్టడంపై మిషన్ ఇంపాసిబుల్, స్కైస్క్రాపర్ లాంటి చిత్రాలు షూటింగ్ జరుపుకొన్నాయి.


యూరప్‌లో ప్రభాస్ సినిమా షూటింగ్

యూరప్‌లో ప్రభాస్ సినిమా షూటింగ్

సాహో చిత్రం షూటింగ్‌ను అబుదాబీతోపాటు యూరప్ దేశాల్లో జరుపాలని యూవీ ప్రొడక్షన్ నిర్ణయించింది. కథలో భాగంగా ఆ ప్రదేశాల్లో చిత్రీకరించాల్సి ఉందట. ఈ చిత్రానికి రన్ రాజా రన్ చిత్ర దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో అనుష్క మరోసారి జతకట్టే అవకాశం ఉందనే వార్త వైరల్‌గా మారింది.English summary
Speculation was rife that Prabhas would make his B-Town debut in a Karan Johar film, but both chose to remain tight-lipped about it. Now, a report in Mid-Day states that it could be Sajid Nadiadwala who brings Prabhas to Bollywood. Apparently, the Tollywood superstar, who is currently in Mumbai, had a few hush-hush meetings with the director-producer. Crew of Saaho will be heading to Dubai to shoot some action scenes from first week of July. The buzz is that an action scene featuring Prabhas will be shot in the iconic Burj Khalifa building. The skyscraper is famous for the high-adrenaline action scenes in Hollywood movies like 'Mission Impossible: Ghost Protocol', 'Skyscrapper' to name a few.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu