»   » 'రావణ్' ప్లాప్ తో రామ్ గోపాల్ వర్మ గుండెళ్ళో రైళ్ళు

'రావణ్' ప్లాప్ తో రామ్ గోపాల్ వర్మ గుండెళ్ళో రైళ్ళు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రావణ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో రామ్ గోపాల్ వర్మ గుండెల్లో రాయి పడిందంటున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తాజాగా నిర్మిస్తున్న రక్త చరిత్ర చిత్రం మార్కిట్ పై రావణ్ ఫ్లాఫ్ ఎఫెక్ట్ భయంకరంగా పడనుందని ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి. రక్త చరిత్ర కూడా రావణ్ ఫాలో అయిన స్టాటజీతోనే హిందీ, తమిళ హీరోలతో తీసారు. అలాగే తమిళ, తెలుగు, హిందీ భాషల వారిని టార్గెట్ చేస్తున్నారు. రావణ్ వర్కవుట్ అయ్యుంటే గ్యారింటీగా రక్త చరిత్రపై మంచి క్రేజ్ వచ్చేదని, మామూలు జనాలు లెక్కలు వేరు, మార్కెట్ లెక్కలు వేరని, వారు కేవలం అప్పటి మార్కెట్ పరిస్ధితులను బేస్ చేసుకునే ఓ చిత్రాన్ని కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు.

అందులోనూ రక్త చరిత్ర కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్న కొద్దిమందీ రామ్ గోపాల్ వర్మ వరస ఫ్లాఫ్ లకు కొంత భయపడుతూంటే, దానికి తోడు ఎక్కువ రేటు చెప్పి వారిని కొనుక్కోకుండా చేస్తున్నారని సమాచారం. అదే విధంగా రావణ్ కూడా తెలుగు వెర్షన్ కి పదిహేను కోట్లు చెప్పి ఎవరూ ముందుకు రాకపోవటంతో రిలియన్స్ వారే స్వంతంగా రిలీజ్ చేసుకునే పరిస్దితి వచ్చింది. ఇవన్ని గమనిస్తున్న రామ్ గోపాల్ వర్మ కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ తో ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మరో ప్రక్క హిందీలో వివేక్ ఒబరాయ్ కు అంత మార్కెట్ లేదు. అతని రీసెంట్ చిత్రం ప్రిన్స్ పెద్ద ఫ్లాఫ్ అయి చిత్రాని మార్కెట్ ను అధోగతికి నెట్టేసింది. ఇక ఆశలు ఏమన్నా ఉంటే అదీ తమిళం మీదే. సూర్య పాత్ర మీదే. రావణ్ కీ రక్త చరిత్రకీ మరో పోలిక ఏమిటంటే ఈ రెండింటిని దక్షిణాది దర్శకులు డైరక్ట్ చేస్తే, ప్రియమణి రెండింటిలోనూ గెస్ట్ పాత్రలు చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu