»   » బాహుబలికి ఇద్దరు డైరెక్టర్లట? నీకంటే నేనే సీన్లు బాగా తీశా? రాజమౌళికి మరో డైరెక్టర్ షాక్

బాహుబలికి ఇద్దరు డైరెక్టర్లట? నీకంటే నేనే సీన్లు బాగా తీశా? రాజమౌళికి మరో డైరెక్టర్ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సిరీస్ చిత్రాలు తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. బాహుబలి చిత్రాలు రాజమౌళిని దేశంలోనే గొప్ప దర్శకుడే ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. బాహుబలికి గొప్ప ప్రేక్షకాదరణ దక్కడం వెనుక ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా లాంటి నటీనటుల ప్రతిభ దాగి ఉన్నది. సాబు సిరిల్, సెంథిల్ కుమార్ లాంటి విశేష కృషి అందుకు కారణమయ్యాయి. తాజాగా బాహుబలి సినిమా వెండితెర మీద గొప్పగా ఆవిష్కృతం కావడం వెనుక మరో వ్యక్తి దాగి ఉన్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఛానెల్లో భల్లాళ దేవ రానా నిర్వహించే యారీ నంబర్ 1 అనే కార్యక్రమంలో ఈ విషయం బయటకు వచ్చింది. బాహుబలికి రెండో డైరెక్టర్‌గా వ్యవహరించింది ఎవరో కాదు రాజమౌళి కుమారుడు కార్తీకేయ కావడం విశేషం.

యారీ నంబర్1‌లో కార్తీకేయ, అఖిల్

యారీ నంబర్1‌లో కార్తీకేయ, అఖిల్

తాజాగా ప్రసారమైన యారీ నంబర్ 1 కార్యక్రమంలో అక్కినేని నటవారసుడు అఖిల్, రాజమౌళి, రమా రాజమౌళి కుమారుడు కార్తీకేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్రానికి సంబంధించిన, ఇతర విషయాలను రానాతోపాటు ప్రేక్షకులతో పంచుకొన్నారు.


కార్తీకేయ ఫోన్ నుంచి రాజమౌళికి ఫోన్

కార్తీకేయ ఫోన్ నుంచి రాజమౌళికి ఫోన్

రానా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తికి ఫొన్ ‌కాల్ చేసి ఓ విషయాన్ని చెప్పి ధైర్యాన్ని చాటుకోవాలి. ఈ నేపథ్యంలో బాహుబలి రెండో యూనిట్‌ డైరెక్టర్ వ్యహరించిన కార్తీకేయ ఫోన్ నుంచి రాజమౌళికి కాల్ చేసి నేనే సీన్లు బాగా చెప్పాలి అని రానా సూచించాడు. దాంతో కొంత తటపటాయించిన కార్తీకేయ.. రాజమౌళికి కాల్ చేశాడు.


రాజమౌళితో మాట్లాడాలి..

రాజమౌళితో మాట్లాడాలి..

ఫస్ట్ అటెంప్ట్‌లో రాజమౌళి కాల్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే కీరవాణి భార్య నుంచి కార్తీకేయకు కాల్ వచ్చింది. ఆ సమయంలో రాజమౌళి డ్రైవింగ్ చేస్తుండటంతో వల్లీ కాల్ చేశారు. ఫోన్ ఎందుకు చేశావని వల్లీ అడుగగా 'నేను రానా షోలో ఉన్నాను. రాజమౌళితో మాట్లాడాల్సి ఉంది. ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి అని కార్తీకేయ సూచించాడు.


నాన్నా నేనే బాగా తీశాను అంటున్నారు..

నాన్నా నేనే బాగా తీశాను అంటున్నారు..

దాంతో లౌడ్ స్పీకర్ ఆన్ చేయగానే నాన్న బాహుబలిలో నేను తీసిన సీన్లే బాగా ఉంటున్నాయి అని అందరూ అనుకొంటున్నారు అని కార్తీకేయ చెప్పాడు. కార్తీకేయ మాటలపై వెంటనే స్పందించిన రాజమౌళి.. నీవు తీసిన సీన్లు అని చెప్పుకోవడానికి వాటిపై ఏమైనా సబ్ టైటిల్స్ వేశామా? అవి నీవు తీసినవని చెప్పుకోవడానికి అని రాజమౌళి అన్నారు.


రానా అలా చెప్పమన్నాడు.

రానా అలా చెప్పమన్నాడు.

తండ్రి పరిస్థితిని గ్రహించిన కార్తీకేయ.. నేను ప్రస్తుతం రానా షోలో ఉన్నాను. రానా ఇలా చెప్పమన్నారని అసలు విషయం వెల్లడించడంతో అందరూ నవ్వుకొన్నారు. ఆ తర్వాత రానాతో మాట్లాడిన రాజమౌళి.. ఏంటీ ఆటపట్టిస్తున్నావా అనే రీతిలో మాట్లాడటం జరిగింది. కార్తీకేయ, అఖిల్ పాల్గొన్న ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా సాగింది.


English summary
Baahubali get huge response for Baahubali. Its grandier attracts the global audience very much. SS Rajamouli's mesmarising creating made everyone spellbound. There is one secret revealed that SS Rajamouli's son Kartikeya was the another director for Baahubali. Second unit was taken care by Rama Rajamouli's son Kartikeya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu