»   » నిజమా కాదా.! రాజమౌళి నుంచి అసలు ప్రకటనే లేదేమిటి?

నిజమా కాదా.! రాజమౌళి నుంచి అసలు ప్రకటనే లేదేమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
కొద్ది రోజుల క్రితమే ఆ వీఆర్ ఎక్స్ పీరియన్స్ ను కళ్లకు కట్టాడు జక్కన్న. ఆ అవకాశం కూడా అతికొద్దిమందికే దక్కింది. 'ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి' పేరుతో ప్రత్యేకమైన వర్చువల్ రియాలిటీ ఆధారిత వీడియోను చూడటానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు.... చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉంది. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే టీం ఒక వైపు తమ సినిమాకు సంబంధించిన పనులు చూసుకుంటూనే మరో వైపు వినూత్న ప్రమోషన్స్ చేస్తోంది. ఆ మధ్య వీఆర్ ఎక్స్ పీరియెన్స్ అంటూ కొత్త టెక్నాలజీ పరిచయం చేసిన జక్కన్న దీంతో మనం మాహిష్మతి రాజ్యంలో ఉండే ఫీల్ ని కలిగిస్తానని చెప్పాడు. ఇప్పుడు అదే పని లో ఉన్నాడు కూడా

ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న బాహుబలి కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనీసం ట్రైలర్‌నైనా చూసేద్దామన్న ఆదుర్దా బాహుబలి అభిమానుల్లో ఉంది. అయితే.. అభిమానుల ఆశలపై ప్రస్తుతం నీళ్లే. ఎందుకంటే సినిమా ట్రైలర్ మరింత ఆలస్యం కాబోతోంది. వాస్తవానికి ఫిబ్రవరి 17నే సినిమా ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. కానీ, వీఎఫ్‌ఎక్స్ పనుల్లో జాప్యం వల్ల అనుకున్న తేదీకి ట్రైలర్ విడుదల సాధ్యపడడం లేదట. దీంతో సినిమా ప్రమోషన్‌ను ఓ కొత్త పంథాలో చేపట్టాలని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి భావిస్తున్నాడంటూ ఒక న్యూస్ బయటికి వచ్చింది.


Is Rajamuli Releasing Bahubali VR Viedeo Today?

'ద స్వార్డ్ ఆఫ్ బాహుబలి' పేరిట వర్చువల్ రియాలిటీ (వీఆర్) ఫార్మాట్‌లో ఒక్క నిముషం నిడివిగల వీడియోను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా ఫిబ్రవరి 17.. అంటే నేడే విడుదల చేస్తారంటూ చెప్పుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో బాహుబలి చిత్ర బృందమే వీఆర్ హెడ్ సెట్లను సమకూర్చే ప్రయత్నాలు చేస్తోందని టాక్.


ఇక, వీఆర్ హెడ్‌సెట్స్ ఉన్నవాళ్లు తమ సొంతంగా కూడా మాహిష్మతి సామ్రాజ్యంలోకి వెళ్లి బాహుబలి వీఆర్ టీజర్‌ను ఎంజాయ్ చెయ్యొచ్చని చెబుతున్నారు. కాగా, బాహుబలి-ద కన్‌క్లూజన్ ట్రైలర్‌ను మార్చి ఆఖరు నాటికి విడుదల చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు కానీ. ఇది నిజమా కాదా అర్థం కావటం లేదు. ఎందుకంటే అటు రాజమౌళి నుంచి గానీ, బాహుబలి యూనిట్ నుంచి గానీ ఈ విషయమై ఏ ప్రకటనా రాలేదు. ఈ విషయం లో అభిమానులు కొంత అయోమయంలోనే ఉన్నారు .

English summary
A Hot News is roaming in Tollywood since Morning that Rajamuli Releasing Bahubali VR Viedeo Today
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu