»   » ఇలియానాని ఉద్దేశించే రామ్ విసుర్లు?

ఇలియానాని ఉద్దేశించే రామ్ విసుర్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను ఎప్పుడూ ఫలానా హీరోయిన్ కావాలని డిమాండ్‌ చేయలేదు. కానీ ఫలానా ఆమె అయితే వద్దు అని మాత్రం చెప్పాను. ఆమె ఎవరు అని మాత్రం అడగొద్దు అని తాజాగా రామ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. దాంతో అందరి దృష్టి ఆ హీరోయిన్ ఎవరనే టాపిక్ వైపు వెళ్ళింది. చాలా మంది ఆమె మరెవరో కాదు రామ్ తో మొదటి సినిమా చేసిన ఇలియానా అంటున్నారు. దేవదాసు చిత్రంలో ఇద్దరూ కలిసి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఊహించని విధంగా ఇలియానా టాప్ హీరోయిన్ గా ఎదిగింది. రామ్ మా్త్రం అలాగే మిగిలిపోయాడు.

ఆ తర్వాత రామ్ ఒక చిత్రం కోసం తమ పెయిర్ రిపీట్ చేస్తే బాగుంటుందని అడగటం జరిగింది.అయితే ఆమె డేట్స్ ఖాళీ లేవని తప్పుకుంది. అప్పటినుంచి రామ్ ఆమెను ఎవాయిడ్ చే్స్తూ వస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇక రామ్ తాజా చిత్రం కందిరీగ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ చిత్రం గురించి వివరిస్తూ..''నా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. వాటిలో ఎప్పుడూ ప్రతినాయకుణ్ని బకరాని చేసి ఆడుకొనేవాణ్ని. ఈ సినిమాలో అలా కాదు.కందిరీగ కుడితే నొప్పి పుడుతుంది.. ఇది కుడితే నవ్వొస్తుంది అంతే. ఓ విజయవంతమైన సినిమాకి ఎలాంటి అర్హతలు ఉంటాయో అవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. వాణిజ్య అంశాలు మేళవించిన మంచి కథ అని తెలిపారు.

English summary
Ram Pothineni’s forthcoming film ‘Kandireega’ is slated for release on 12th of August.It is a romantic comedy entertainer directed by Santosh Srinivas and produced by Bellamkonda Suresh under Sri Sai Ganesh Productions studio. Hansika Motwani and Aksha are heroines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu