»   » స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ గర్ల్ ఫ్రెండ్ సంచలన ప్రకటన...!

స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ గర్ల్ ఫ్రెండ్ సంచలన ప్రకటన...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిటైర్మెంట్ ఏజ్ కి రాకుండానే వాలంటరీగా రిటైరయ్యే గవర్నమెంట్ ఉద్యోగుల పద్దతిని సినీ పరిశ్రమకి ముడిపెడుతూ ప్రముఖ కన్నడ నటి రమ్యా నంబీసన్ అలియాస్ దివ్య స్పందన సంచలన ప్రకటన చేసింది తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సినిమాలకి సెలవు చెబుతున్నట్టు ప్రకటించింది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువే కనుక ఫామ్ లో ఉండగా ఎవరూ రిటైర్ కావలని కోరుకోరు పరిశ్రమ ఛీకొట్టే వరకు అక్కడే వేలాడతారు. కానీ దివ్వ మాత్రం అందుకు భిన్నంగా ఫామ్ లో ఉండగా వెళ్లిపోతానంటోంది. అది కూడా పెళ్లి చేసుకోవాలనో, మరోదో కారణాల చేతకాదు. వివాదాలకి దగ్గరి బంధువైన దివ్య నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లోకెక్కుతూ ఉంటుంది.

ఇటీవల 'దండం దశగుణం" అనే కన్నడ చిత్రం ఆడియో వేడుకకి రమ్య హాజరు కాకపోవడం పట్ల ఆగ్రహించిన ఆ చిత్ర నిర్మాత ఆమెపై నిర్మాతల మండలిలో కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో ఆమెపై కఠిన చర్యలకు వారు పూనుకుంటూ ఉండగా, దివ్య ఈ సంచలన ప్రకటన చేసింది. అలాగే తెలుగులో అభిమన్యు, సూర్య సన్నాఫ్ కృష్ణన్, అమృతవర్షం తదితర చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా టాలీవుడ్ మగధీరుడి కి చాలా మంచి ఫ్రెండ్, ఆమెతో రామ్ చరణ్ కి ఎలా పరిచయం అయిందని ఆసక్తి కలగటం సహజమే. నిజానికి వీరి స్నేహం ఫిల్మ్ ఏక్టింగ్ కోర్స్ సమయంలో జరిగిందిట. అక్కడ వీరిద్దరూ క్లాస్ మేట్స్. ఆ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా మెలిగేవారు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో డైలీ ఛాటింగ్ చేసుకునేవారిని, ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుకునే వారని, సౌత్ స్కోప్ అవార్డుల పంక్షన్ లో మళ్ళీ కలిసారని అతని సన్నిహితులందించిన సమాచరం. కాగా దివ్య స్పందనకి కన్నడంతో పాటు తమిళంలో కూడా మంచి ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా బాగా ఉంది.

English summary
Ramya who has been a focus of controversy with regard to her absence during the audio release function of the film Dandam Dashagunam produced by A. Ganesh had announced that she will take voluntary retirement from films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu