»   » ప్రధాని హత్య కేసులో..... రానా చేయబోతున్న సినిమా ఇదే

ప్రధాని హత్య కేసులో..... రానా చేయబోతున్న సినిమా ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానా తెర మీద అనుభవం తక్కువే అయినా ఒక డిఫరెంట్ వే లో తనకంటూ ఒక స్థాయిని టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ వరకూ ఏర్పరచుకున్న నటుడు. నిజానికి రానా సినిమా ల్లో హీరో మాత్రమే కాదు ఒక రానా యాక్టర్. తాను చేయ బోయే పాత్ర ఎంత ప్రత్యేకంగా ఉంటుబందీ అని తప్ప అది మెయిన్ రోలా? క్యారెక్టర్ రోలా? విలన్ లా కౄరంగా కనిపించే పాత్రా అని ఆలోచించడు.

మిగతా హీరోలకంటే డిఫరెంట్ గా

మిగతా హీరోలకంటే డిఫరెంట్ గా

ఆ ప్రత్యేకతే రానా ని మిగతా హీరోలకంటే డిఫరెంట్ గా నిలబెట్టింది. బెంగుళూరు డేస్ లాంటి సినిమాలో చేసేటప్పుదే బాహుబలి లో పాత్ర చేసాడు... అవి అటు పూర్తయ్యాయో లేదో ఘాజీ లాంటి పాటలూ, ప్రత్యేక హీరోయిజం అంటూ లేని సినిమాకి ఒప్పుకొని ఆ పాత్రలోనూ ఒదిగిపోయాడు.

నేనే రాజు నేనే మంత్రి

నేనే రాజు నేనే మంత్రి

త్వరలో 'నేనే రాజు నేనే మంత్రి'తో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. మనవాళ్ళు ప్రయత్నించీ ఓడిపోతున్న బాలీవుడ్ లో కూడా రానాకి ఒక గుర్తింపు ఉంది... ఇప్పుడు కూడా ఇంకో నేషనల్ ఇండస్ట్రీ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర చేయబోతున్నాడు....

తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ

తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ

దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య పై కన్నడ డైరెక్టర్ ఏఎంఆర్ రమేశ్ ఓ సినిమా నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు.... హిందీ నటుడు రవి కాలే ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించాలనేది దర్శకనిర్మాతల ప్లాన్.

అందరికీ పరిచయమే

అందరికీ పరిచయమే

ఈ భాషలన్నిటిలో ప్రేక్షకులకు బాహుబలితో రానా అందరికీ పరిచయమే. అంతేకాకుండా దేశంలో ఏ యుద్ధ కథ చిత్రాలు తీద్దాం అనుకున్న అందరికీ గుర్తుకు వచ్చేది రానా పేరే... ఎందుకంటే తన బాడీ ఫిట్నెస్ అలా మలుచుకున్నాడు రానా.

సీబీఐ ఆఫీసర్ డి.ఆర్.కార్తికేయన్

సీబీఐ ఆఫీసర్ డి.ఆర్.కార్తికేయన్

అయితే ఈ సినిమాలో కీలక పాత్ర సీబీఐ ఆఫీసర్ డి.ఆర్.కార్తికేయన్ పాత్ర కోసం రానాను సంప్రదించారట. ప్రస్తుతం రానాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రోల్ ఆఫర్ చేసినట్లు టాక్. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉండడంతో రానా ఈ సినిమాకు ఓకే చెప్పారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావాల్సివుంది.

English summary
It is learned from sources that Rana Daggubati has been approached to play the lead role in a film that is about the former Prime Minister Rajiv Gandhi’s assassination way back in 1991
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu