»   » శ్రీనువైట్లతో సినిమానా?.. రిస్క్ చేస్తున్న మాస్ హీరో..

శ్రీనువైట్లతో సినిమానా?.. రిస్క్ చేస్తున్న మాస్ హీరో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో మాస్ మహారాజ పేరు ఉన్న రవితేజ వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నారు. టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలపై భారీగా నమ్మకాన్ని పెట్టుకొన్నారు. బెంగాల్ టైగర్ చిత్రం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకొన్న రవితేజ మరో హిట్ కొట్టేందుకు సిద్ధపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీను వైట్లతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రవితేజ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఓ వైపు ప్రశంస.. మరో వైపు విమర్శలు

ఓ వైపు ప్రశంస.. మరో వైపు విమర్శలు

ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి సాహసం చేస్తున్న రవితేజ తీరుపై ఓ పక్క విమర్శలు వినిపిస్తుంటే మరో పక్క కెరీర్ తొలినాళ్లలో హిట్లు ఇచ్చి స్టార్ హీరోను చేసిన శ్రీనువైట్లకు అండగా నిలువడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


మిస్టర్ తర్వాత దారుణంగా..

మిస్టర్ తర్వాత దారుణంగా..

మిస్టర్ సినిమా తర్వాత శ్రీనువైట్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైందనే మాట వినిపిస్తున్నది. ఆయనను ఏ హీరో కలుసుకోవడానికి ఇష్టపడటం లేదనే రూమర్ ప్రచారంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో శ్రీనువైట్లతో జతకట్టడం భారీ సాహసమే అనే మాట వినిపిస్తున్నది.


భయంతో అభిమానులు..

భయంతో అభిమానులు..

ఇదిలా ఉండగా శ్రీనువైట్లతో సినిమా చేస్తే రవితేజ పరిస్థితి ఏమౌతుందో అనే భయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయితే శ్రీనువైట్ల ప్రతిభపై రవితేజ చాలా నమ్మకంతో ఉన్నట్టు సమాచారం. ఆ ధీమాతోనే రవితేజ ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.


శ్రీనువైట్ల మానసిక పరిస్థితి

శ్రీనువైట్ల మానసిక పరిస్థితి

మిస్టర్ సినిమా ఫ్లాప్ తర్వాత ఆస్తులు అమ్ముకున్నట్టు వార్తలు వచ్చాయి. మానసికంగా చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సొంత ఆస్తులు కూడా అమ్ముకున్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాకుండా మిస్టర్ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు అని సినీ వర్గాలు చెప్పుకొన్నాయి.


శ్రీనువైట్ల కథ డిఫరెంట్‌గా

శ్రీనువైట్ల కథ డిఫరెంట్‌గా

అయితే ప్రస్తుతం హిట్ కొట్టేందుకు శ్రీను వైట్ల కసిగా ఉన్నారని, ఆ క్రమంలోనే ఆయన చెప్పిన కథ చాలా విభిన్నంగానూ, ఆసక్తిగానూ ఉండటంతో వెంటనే శ్రీనువైట్లకు సినిమా చేస్తున్నామని చెప్పినట్టు తెలుస్తున్నది.


హిట్లు ఇచ్చిన స్నేహితుడి కోసం.

హిట్లు ఇచ్చిన స్నేహితుడి కోసం.

రవితేజ నటుడిగా నిలుదొక్కుకునే సమయంలో నీ కోసం, వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి విభిన్నమైన చిత్రాలను ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల ఇచ్చిన సహకారంతోనే నేను హీరోగా నిలదొక్కుకున్నాననే భావనలో రవితేజలో ఉందట. అందుకనే తనకు సన్నిహితుడైన శ్రీనువైట్ల అండగా నిలువాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.English summary
Raviteja gives green singnal to flop director Srinu Vaitla. Now Mass Maharaja is doing Touch Chesi Chudu, Raja The Great. After this movies Raviteja wants do a film with Srinu Vaitla.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu