»   »  వరుస ఫ్లాపులు, ఇక రిటైర్ అవ్వాలా?? విపరీతమైన ఒత్తిడిలో అగ్రహీరో

వరుస ఫ్లాపులు, ఇక రిటైర్ అవ్వాలా?? విపరీతమైన ఒత్తిడిలో అగ్రహీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ సినిమాలకు బై బై చెప్పే సమయం దగ్గరపడింది అంటున్నారు బాలీవుడ్‌ జనాలు. నిన్న మొన్నటి వరకూ సినిమా వసూళ్లలో అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లతో పోటీపడే బాద్‌షాకి రాయీస్‌ సినిమా పెద్ద షాకే ఇచ్చింది. ఒకప్పుడు వరుస హిట్స్ తో తిరుగులేని హీరో అనిపించుకున్న స్టార్ షారూఖ్.

కానీ ఇప్పుడు తన రేంజ్ సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య వచ్చిన ఫ్యాన్ అతి ధారుణమైన పరాజయాన్ని చవి చూసింది దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా మరింత నిరాశలోకి తోసేస్తూ వచ్చాయి. అటు చూస్తే సల్మాన్ అమీర్లు సక్సెల తో దూసుకు పోతున్నారు. సుల్తాన్, దంగల్ లాంటి సినిమాలు వారిని షారూఖ్ నుంచి వేరు చేసి చూపిస్తున్నాయి. అదివరకంటే స్టార్ స్టామినా ఉండేది హీరో కోసమే సినిమా చూసే వారు ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు...

కానీ ఇప్పుడా సంఖ్య బాగా తగ్గిపోయింది. వారి టేస్ట్ కు తగ్గట్టుగా స్క్రీన్ మీద కనిపిస్తేనే హీరోలకు హిట్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఈ విషయాన్ని పట్టించుకోకపోతే ఎంత పెద్ద హీరో సినిమానైనా ఈజీగా రిజక్ట్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీరే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

Shahrukh Khan

ఓ వైపు క్యారెక్టర్స్ తో ప్రయోగాలు చేస్తున్న ఆమిర్ ఖాన్, మరోవైపు కథల్లో కాస్త కొత్తదనం చూపిస్తున్న సల్మాన్ ఖాన్ వందల కోట్ల వసూళ్లు సాధిస్తుంటే, రొటీన్ కథలనే ఎక్కువగా నమ్ముకుంటున్న కింగ్ ఖాన్ మాత్రం ప్రేక్షకులను మెప్పించేందుకు నానా తంటాలు పడుతున్నాడు.

ఈసారి మాత్రం రొటీన్ కి భిన్నంగా ట్రై చేసాడు. ఒక కాన్సెప్టును తీసుకుని.. దానికే స్ట్రిక్ట్ గా కట్టుబడి ఈ సినిమాను రూపొందించాడు షారూఖ్. సినిమాలో గుజరాత్ లో ప్రొహిబిషన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే మద్యం దందా.. చాలా అద్భుతంగా చూపించాడనే చెప్పాలి. చివరకు అసలు షారూఖ్ ఖాన్ క్యారెక్టర్ పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోవడం అనే భారీ ఫీటును కూడా కూడా చేసినా షారూఖ్ ఫ్లాప్ ని తప్పించుకోలేకపోయాడు.

రయీస్ సినిమా దాదాపు రెండు వందల కోట్లు వసూలు చేస్తుందని అందరూ ఊహించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమాకు కనీసం వసూళ్లు రావడం గగనమైపోయింది. ఈ ఒక్క సినిమానే కాకుండా ఇటీవలి కాలంలో బాద్‌షా సినిమాలు అనుకున్న రేంజ్‌లో సక్సెస్‌ కావడం లేదు. ప్రస్తుతానికి అతని చేతిలో సినిమాలేవీ లేవు కూడా!

ఇన్ని పరిణామాల మధ్యలో బాద్‌షా హీరోగా బై బై చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బాలీవుడ్‌ జనాలు. తమ హీరో హవా ఇంకా తగ్గలేదనీ, ఒక్కటంటే ఒక్క హిట్టు పడితే మునుపటి రేంజ్‌ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని బాద్‌షా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నా, అలాంటి పరిస్థితులు ఏవీ దరిదాపుల్లో కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు.

English summary
Bollywood Badshah Sharukh khan lost his grace? some of Bollywood gangs saying that it is better Time to Anaunce his ritirement From bollywood
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu