Bigg Boss బ్యూటీతో రోహిత్ శర్మ డేటింగ్.. అఫైర్‌లో చిచ్చు పెట్టిన విరాట్ కోహ్లీ!

క్రికెటర్లకు సినీ తారల మధ్య డేటింగ్స్, అఫైర్ల విషయం కొత్తేమీ కాదు.. గతంలో చాలా మంది సినీ తారలు ఇలాంటి వ్యవహారాలతో మీడియాలో పతాక శీర్షికల్లో కనిపించారు. అయితే తాజాగా క్రికెటర్ రోహిత్ శర్మ, బిగ్‌బాస్ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ సోఫియా హయత్ అఫైర్ మరోసారి మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

సోఫియా హయత్ కెరీర్ గురించి

సోఫియా హయత్ కెరీర్ గురించి

బాలీవుడ్‌లోను, టెలివిజన్ రంగంలోను సోఫియా హయత్‌కు మంచి పాపులారిటీ ఉంది. గాయనిగా, నటిగా, టెలివిజన్ పర్సనాలిటీగా తన టాలెంట్‌ను రుజువు చేసుకొన్నది. అయితే తన ప్రతిభ కంటే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతోనే అత్యంత పాపులారిటీ సంపాదించింది.

బిగ్‌బాస్‌ హిందీతో పాపులారిటీ

బిగ్‌బాస్‌ హిందీతో పాపులారిటీ

నటిగా, సింగర్‌గా అంతగా పేరు సంపాదించలేని సోఫియా హయత్ హిందీ బిగ్‌బాస్‌లో కనిపించిన తర్వాతే ఆమెకు మరింత పాపులారిటీ క్రేజ్ సంపాదించుకొన్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ 7లో సోఫియా అదరగొట్టేసింది. 2013 నుంచి టాప్ సెలబ్రిటీగా అందర్ని ఆకర్షించింది.

 రోహిత్ శర్మతో అఫైర్

రోహిత్ శర్మతో అఫైర్

ఇలాంటి నేపథ్యం ఉన్న సోఫియా హయత్‌, క్రికెటర్ రోహిత్ శర్మ మద్య అఫైర్ అత్యంత చర్చనీయాంశమైంది. వారిద్దరి రొమాన్స్ మరింత ముదిరిపోయింది. వారిద్దరి ఫోటోలు, అతి సన్నిహితంగా ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలోను, మీడియాలోను వైరల్ అయ్యాయి. అయితే వారిద్దరి ప్రేమ వ్యవహారం ఎంత వేగంగా ముదిరిందో.. అంతే వేగంగా కూడా బ్రేకప్ జరిగింది.

 రోహిత్ ప్రేమలో చిచ్చు పెట్టిన కోహ్లి

రోహిత్ ప్రేమలో చిచ్చు పెట్టిన కోహ్లి

అయితే రోహిత్ శర్మ, సోఫియా హయత్ ప్రేమ వ్యవహారం విఫలం కావడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లి అనే విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. రోహిత్‌‌తో వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే సోఫియాతో కోహ్లి రిలేషన్ పెట్టుకొన్నారు. ఆ కారణంగానే సోఫియాకు రోహిత్ బ్రేకప్ చెప్పాడు. సోఫియాతో బ్రేకప్ కారణం విరాట్ కోహ్లీ అనే విషయం మీడియాలో హైలెట్ అయింది.

గ్రౌండ్ బయట రోహిత్ కంటే విరాట్ మంచి ప్లేయర్ అంటూ

గ్రౌండ్ బయట రోహిత్ కంటే విరాట్ మంచి ప్లేయర్ అంటూ

రోహిత్‌తో బ్రేకప్ గురించి సోఫియా హయత్ సంచలన ట్వీట్ చేసింది. విరాట్ మైదానం బయట మంచి ప్లేయర్. అందుకే రోహిత్‌ను వదులుకొన్నాను అని సోఫియా తన ట్వీట్‌లో పేర్కొవడంతో ఆ బ్రేకప్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. సోఫియా హయత్‌ బ్రేకప్ తర్వాత రోహిత్‌కు రితికా సజ్‌దే అనే యువతితో పరిచయం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకొని డిసెంబర్ 2015లో వివాహం చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X