»   » పేద నటున్ని ఆదుకున్నాడు సరే... ఈ ఆరోపణలేమిటీ? అరసు ఆత్మహత్యా యత్నానం వెనుక హీరో విశాల్..!??

పేద నటున్ని ఆదుకున్నాడు సరే... ఈ ఆరోపణలేమిటీ? అరసు ఆత్మహత్యా యత్నానం వెనుక హీరో విశాల్..!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ నటుడు ఇళవరసన్‌కు హీరో విశాల్ ఆర్థిక సాయం అందించాడు. పలు తమిళ చిత్రాల్లో సహాయ నటుడిగా నటించిన ఇళవరసన్ వ్యక్తిగత, ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

దీంతో తన దేవీ సంక్షేమ సంఘం తరపున కొంత మంది వ్యక్తుల ద్వారా రూ.10 వేలు పంపించినట్లు సమాచారం. అంతేగాకుండా ఇళవరసన్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని విశాల్ మాటిచ్చినట్టు సమాచారం..

చెన్నై వరదల సమయంలో స్వయంగా వెళ్లి బాధితులకు ఆపన్న హస్తం అందించి అందరి మన్ననలను పొందిన విశాల్‌ ఇప్పుడు మళ్లీ ఇలా ఇంకోసారి అభిమానుల మనసు దోచుకున్నారు.. ఇక్కడి వరకూ బాగానే ఉంది... కానీ విశాల్ ఆర్థిక సాయం చేటానికి ముందు జరిగింది మాత్రం వేరే... ఒక రకంగా విశాల్ పట్టించుకోకపోవటం వల్లే అరసు ఆత్మహత్య వరకూ వెళ్ళాడూ అనేది ఒక వాదన... ఇంతకీ విషయం ఏమిటంటే.

అరసు (ఇళవరసన్)

అరసు (ఇళవరసన్)

వ్యాసర్పాడి ఎంకేబీ నగర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్టు అరసు (ఇళవరసన్) నడిగర్ సంఘం సభ్యుడిగా ఉన్నాడు. సుమారు 40 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన అతనికి పారితోషికం సక్రమంగా అందలేదన్న భాదలోనే ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు.

విడాకులు కోసం

విడాకులు కోసం

మరోవైపు ఆయన భార్య శశికళతో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ దంపతులు విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.

ఎలుకల మందు తాగి

ఎలుకల మందు తాగి

ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి సెల్వరాజ్ ఆత్మహత్యకు యత్నించారు. అతని నోటి నుండి నురగ రావడం గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్సలందించిన వైద్యులు సెల్వరాజ్ ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు.

విశాల్ కి రాసిన లేఖ వివాదం

విశాల్ కి రాసిన లేఖ వివాదం

అయితే ఆత్మహత్యయత్నానికి ముందు ఆయన నటుడు విశాల్ కి రాసిన లేఖ వివాదంగా మారింది.తనకు కొందరు నిర్మాతలు డబ్బులివ్వకుండా ఏడిపిస్తున్నారనీ.. ఈవిషయం లో నడిగర సంఘం జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలనీ కోరాడు ఇళవరసన్.

 విశాల్ మీద ఆరోపణలు

విశాల్ మీద ఆరోపణలు

అయితే ఆ లేఖని పట్టించుకోకుండా... అతన్ని ఆదుకోవటానికి ఏ ప్రయత్నమూ చేయకపోవటం తో అప్పటి కే ఇబ్బందుల్లో ఉన్న ఇళవరసన్ ఆత్మహత్య కు ప్రయత్నించాడని విశాల్ మీద ఆరోపణలు వస్తున్నాయి.

నడిగర్ సంఘం ఆదుకోలేదన్న ఆవేదన

నడిగర్ సంఘం ఆదుకోలేదన్న ఆవేదన

తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నడిగర్ సంఘం ఆదుకోలేదన్న ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కోలీవుడ్ పరిశ్రమలో ఈ విషయం కలకలం రేపింది.

ఆదుకుంటామని హామీ ఇవ్వబట్టే

ఆదుకుంటామని హామీ ఇవ్వబట్టే

ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాటి కళాకారులను ఆదుకుంటామని హామీ ఇవ్వబట్టే తాము విశాల్ టీమ్ ను గెలిపించామని..

హామీలను విశాల్ మంటగలిపారు

హామీలను విశాల్ మంటగలిపారు

అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత నడిగర్ సంఘం నిర్వాహకుల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విశాల్ మంటగలిపారని ఆరోపించారు.ఇప్పటికైనా నడిగర్ సంఘం సరైన రీతిలో వ్యవహరించి ఇళవరసన్ డబ్బులు అతనికి ఇప్పించాలని కోరారు.

మాటిచ్చాడట

మాటిచ్చాడట

ఇదంతా జరిగాకే విశాల్ పంపిన 10,000 రూపాయలు ఇళవరసన్ చేతికి అందాయి. అయితే అతని పారితోషికాల విషయంలో ఇప్పటికిప్పుడు కాదు గానీ త్వరలోనే పరిష్కరిస్తాం అంటూ మాట ఇచ్చాడట విశాల్.

English summary
Vishal's life saving help for an actor who commited for suicide... but a Buzz is that Vishal behind his suicide attempt
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu