For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సునీల్ హీరోయిన్ కి ఎన్టీఆర్ తో ఛాన్స్

  By Srikanya
  |

  జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము లో సెకెండ్ హీరోయిన్ గా ఇషా ఛావ్లాని ఎంపిక చేసినట్లు సమాచారం. సునీల్ సరసన పూలరంగడు చిత్రంలో చేస్తున్న ఆమెను ఈ భారీ ఆఫర్ వరించింది.ఇక కొద్ది రోజుల క్రితం..ఈ చిత్రం నుండి డేట్స్ సర్దుబాటు చెయ్యలేక శృతి హాసన్ బయిటకు వెళ్లిపోయింది. ఆమె ప్లేసులో కాజల్ ని మెయిన్ హీరోయిన్ గా ఎన్నుకున్నారు. అయితే హన్సిక కూడా మరో ఆప్షన్ ఉంది. అయితే ఆమె లావు అవటంతో జూ.నమిత అనే పేరు తెచ్చుకున్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పరిశీలుస్తున్నారు. అలాగే అందూలోనూ హన్సిక..కంత్రిలో చేసింది. దాంతో రీసెంట్ గా ప్రేమే కావాలి చిత్రంతో ఆకట్టుకున్న ఇషా ఛావ్లా అయితే ప్రేక్షకులు ప్రెష్ గా ఫీలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తన్నారు.

  ఇక శృతి హాసన్ ఆమె పదిరోజులు పాటు దమ్ము షూటింగ్ లో కూడా పాల్గొంది.అయితే షూటింగ్ ని ఊసరవెల్లికి బ్రేక్ ఇచ్చి ప్రారంభించటంతో ఆమె సారి చెప్పి బై చెప్పిందని సమాచారం. ఆమె తనకు డేట్స్ లేకపోవటంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆమె వాలంటరిగా టీమ్ కి గుడ్ లక్ చెప్పి బయిటకు వెళ్లటంతో ఈ మ్యాటర్ ఇష్యా కాలేదు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలు కానుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా 'దమ్ము"ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్‌ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

  English summary
  Dammu, being directed by Boyapati Srinu, is two-heroines story. So for second female lead, the toss is between Isha Chawla and Karthika (Radha's daughter).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X