సునీల్ కి పిల్ల దొరికింది
సునీల్ హీరోగా మాక్స్ ఇండియా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'అహ నా పెళ్లంట' దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వం వహించే ఈ చిత్రానికి కె.అచ్చిరెడ్డి నిర్మాత. ఈ సినిమాలో సునీల్‌కి జోడీగా ఇషా చావ్లా నటించబోతోంది. 'ప్రేమ కావాలి'తో పరిచయమైన ఇషాకు ఇది రెండో చిత్రం. ఈ నెల 18న లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమవుతుంది. వచ్చే నెల 1 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ ఉంటుంది. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట త్రిషను అనుకున్నారు. కానీ ఆమె సునీల్ ప్రక్కన చేయటానికి రెండు కోట్లు డిమాండ్ చేయటంతో మానుకున్నారు. అలాగే ఆ తర్వాత శ్రియను కూడా అడగటం జరిగింది.కానీ ఆమె కూడా కొన్ని కండీషన్స్ పెట్టడంతో చివరకు ఈ ఆఫర్ ఇషాను వరించింది. ఇక ఈ చిత్రం కామిడీ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు. రెండు ఫైట్స్ ఉన్నా 'అహ నా పెళ్లంట' తరహాలోనే పూర్తి స్ధాయి వినోదాత్మకంగా ఉంటుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











