»   » షారూఖ్ ఉన్నా లేకున్నా ఆమె ఉంటుందట: మరి ఫెంటాస్టిక్ రూమర్ అంటుందేమిటి??

షారూఖ్ ఉన్నా లేకున్నా ఆమె ఉంటుందట: మరి ఫెంటాస్టిక్ రూమర్ అంటుందేమిటి??

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శుద్ధ్ దేశీ రొమాన్స్'తో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి, 'ఆహా కళ్యాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన వాణీ కపూర్ బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగే పెంచుకుంటోంది. ఆమధ్య ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటు వచ్చిన వార్త్లని గట్టిగానే ఖండించింది. అందంగా కనిపించేందుకు తాను ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నానంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, వాటిని నమ్మవద్దని బాలీవుడ్ నటి వాణీకపూర్ తన అభిమానులను కోరింది. గతంలో కంటే ఇప్పుడు తాను ఎంతో బరువు తగ్గానని, అందుకే, తన ముఖంలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో మార్పును గమనిస్తున్నారని చెప్పింది.

తాజాగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన బేఫిక్రే సినిమాలో నటించిన వాణీ కపూర్.. తన మీద ఓ ఫెంటాస్టిక్ రూమర్ వచ్చిందని చెబుతోంది. ఆ రూమర్ గురించి ఆమె కాస్తంత సంతోషించింది కూడా లెండి. ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఆమె నటించబోతోందని! ఎలె ఇండియా గ్రాడ్యుయేట్స్ ఫ్యాషన్ షోకు వచ్చిన ఆమెను మీడియా వాళ్లు పలకరించి..

It is a fantastic rumour which I hope turns into a reality - Vaani Kapoor

బేఫికెర్ తర్వాత షారూఖ్ ఖాన్ తో ఆదిత్య చోప్రా చేయబోయే సినిమా లో కూడా మీరే సెలెక్ట్ అయ్యారట అని అడగగానే... ''అలా జరిగితే చాలా సంతోషించేదాన్ని. అదో ఫెంటాస్టిక్ రూమర్. అది నిజమైతే బాగుండని అనుకుంటున్నాను కానీ దాని గురించి నాకు ఏమీ తెలియదు. ఇప్పటికైతే.. ఆ సినిమాలో నేను లేను''అని చెప్పింది. అయితే ఆ సినిమానే ఇంకా మొదలు కాలేదనీ, ఒక వేళ మొదలైతే మాత్రం షారూఖ్ ఉన్నా లేకున్నా వాణీ మాత్రం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడ అమ్మడు ఇండైరెక్ట్ గా ఇచ్చిన హింటేమిటంటే ఇప్పుడు రాబోతున్న సినిమా పేరు కూడా... "ఫెంటాస్టిక్ రూమర్" అట

రాబోయే సినిమాల సంగతేంటని అడిగితే, ఇప్పటివరకు ఏమీ ప్లాన్ చేయలేదని, ప్రస్తుతం స్క్రిప్టులు చదువుతున్నాను గానీ వేటినీ అంగీకరించలేదని తెలిపింది. ఏదైనా సినిమాకు సైన్ చేస్తే ముందు మీడియాకే కదా ముందు చెప్పాల్సిందీ అంటూ నవ్వేసిన వాణీ కపూర్ ఇక బేఫికర్ గురించి మాట్లాడుతూ సినిమా కొంతమందికి నచ్చింది గానీ, కొంతమందికి అసలు కనెక్ట్ కాలేదంది. అది రొమాంటిక్ కామెడీ అని.. అలాంటి సినిమా నుంచి ఇంకేం ఆశిస్తారని అడిగింది.

English summary
Vaani said: “I hope that happens. It is a fantastic rumour which I hope turns into a reality. However, I have no idea about it. As of now, I am not in this movie.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu