»   » రజనీతో దెబ్బలు తినడం ఆనందమే: అక్షయ్

రజనీతో దెబ్బలు తినడం ఆనందమే: అక్షయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ ‘2.0' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రోబో చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ మధ్య భారీ యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయి.

దీనిపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ...‘సినిమా కెరీర్లో ఎన్నో ఫైట్లు చేసాను. రజనీతో ఫైట్ పైట్ చేయడం, ఆయనతో దెబ్బులు తినే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ ఫైట్ సీన్ల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏమీ తీసుకోలేదు' అని అక్షయ్ కుమార్ స్పష్టం చేసారు.

It is great to be punched by a superhero like Rajinikanth: Akshay Kumar

ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ ఇప్పుడు తన బరువుని పెంచే పనిలో పడినట్లు సమాచారం. ఈ చిత్రంలో అక్షయ్ నెగిటివ్ పాత్రను పోషిస్తున్నారని, అందుకోసం ఆయన స్పెషల్ ఫిటినెస్ క్లాస్ లకు సైతం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అక్షయ్ స్థానంలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ని అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు.

రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే ఈ భారి బడ్జెట్ సినిమా కు సుమారు 400 కోట్ల రూపాయలవరకు ఖర్చు అవ్వోచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తమిళ మీడియా కథనం ప్రకారం ఈ సినిమాకు ప్రోడక్షన్ కాస్టింగ్ 350 కోట్ల వరకు అవ్వోచ్చని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మెత్తం పోస్ట్ ప్రోడక్షన్ తో కలిపి 400 నుండి 450 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని అంచనా ఉంది.

English summary
Actor Akshay Kumar, who would be teaming up with Rajinikanth as the main antagonist in the sequel of hit sci-fi film “Robot”, is elated to be exchanging some punches with the south superstar on-screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu