»   » రంగస్థలం ముద్దు సీన్: సమంత రియాక్షన్, అసలు నిజం ఇదీ...

రంగస్థలం ముద్దు సీన్: సమంత రియాక్షన్, అసలు నిజం ఇదీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రంగస్థలం సినిమాలో రివేంజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ ఎంత ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాడో.... హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా అంతే క్యూట్‌గా మలిచి ప్రేక్షకులను మెప్పించాడు. సమంత, చరణ్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను యువతను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా చరణ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే సమయంలో వీరిద్దరి మధ్య వచ్చే ముద్దు సీన్ సినిమాకే హైలెట్.

Sukumar Shares Funny Incident In Rangasthalam Set
 ఈ ముద్దు సీన్ తెలివిగా ప్లాన్ చేసిన సుకుమార్

ఈ ముద్దు సీన్ తెలివిగా ప్లాన్ చేసిన సుకుమార్

రామ్ చరణ్‌కు స్క్రిప్టు చెప్పే సమయంలో సినిమాలో ముద్దు సీన్ ఉంటుందనే విషయమే చెప్పలేదట దర్శకుడు. సెట్లో సీన్ ప్రారంభించే వరకు ఆ విషయం చెర్రీకి చెప్పకుండా ఉంచారు. సమంతకు మాత్రం ఈ విషయం ముందే చెప్పారట.


చరణ్‌ను అప్పటికప్పుడు ఒప్పించాం

చరణ్‌ను అప్పటికప్పుడు ఒప్పించాం

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ.... సీన్ చిత్రీకరించే సమయానికి మేము చెర్రీకి విషయం చెప్పి ఒప్పించాం. ముందు చెప్పలేదు కాబట్టే ఆ సీన్ బాగా పండింది. కేవలం 45 నిమిషాల్లో సీన్ పూర్తి చేశాం... అని సుకుమార్ అన్నారు.


చెర్రీకి లిప్ లాక్ ఇవ్వలేదంటున్న సమంత

చెర్రీకి లిప్ లాక్ ఇవ్వలేదంటున్న సమంత

ఈ సీన్ గురించి సమంత కూడా రియాక్టయినట్లు తెలుస్తోంది. సినిమాలో ముద్దు సీన్ నిజమే కానీ, అది లిప్ లాక్ కాదని, తాను కేవలం చెర్రీ బుగ్గపైనే ముద్దు పెట్టానని.... అయితే ప్రేక్షకుల్లో అలాంటి భావన కలిగేలా కెమెరా ట్రిక్ ప్లే చేశారని సమంత అంటోంది.


పెళ్లైన హీరోయిన్లనే ఇలా ఎందుకు అడుగుతారు?

పెళ్లైన హీరోయిన్లనే ఇలా ఎందుకు అడుగుతారు?

పెళ్లైన హీరోయిన్లనే ఇలా ఎందుకు అడుగుతారో అర్థం కాదు, చాలా మంది పెళ్లైన హీరోలు కూడా ఆన్ స్క్రీన్ కిస్ సీన్లు చేస్తున్నారు. సుకుమార్ చెప్పిన స్క్రీప్ట్ నాకు ఎంతో నచ్చింది. అందుకే ఆ సీన్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. స్క్రీప్ట్ ప్రకారం లిప్ లాక్ కరెక్టే అనిపించింది, కానీ నేను లిప్ లాక్ పెట్టలేదు, అతడి బుగ్గలపైనే ముద్దు పెట్టాను అని సమంత అన్నట్లు సమాచారం


 రంగస్థలం

రంగస్థలం

కాగా రంగస్థలం చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పంట పండిస్తోంది. బాక్సాఫీసు వద్ద 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 150 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడంతో పాటు రూ. 95 కోట్ల షేర్ రాబట్టింది. అన్ని ఏరియాల్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు లాభాలు ఆర్జించారు.


English summary
"I kissed Charan on his cheeks and the liplock was a camera trick” Samantha said about Rangasthalam kiss scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X