»   » ఆపండి ...అది మా అబ్బాయి కాదు :అల్లు అర్జున్

ఆపండి ...అది మా అబ్బాయి కాదు :అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ కుమారుడు అంటూ మీరు చూస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్స్ లో చక్కర్లు కొడుతూ, ఫ్యాన్స్ అందరూ ఆనందంతో షేర్ చేసుకుంటున్నారు. బన్ని భార్య స్నేహ రెడ్డి ఓ బాబుని ఎత్తుకున్న ఫొటొ అది. ఆ ఫొటో అల్లు అర్జున్ కుమారుడు ఆర్యన్ అనుకున్నారు అంతా. అయితే ఈ విషయమై అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు.

అల్లు అర్జున్ రాస్తూ..." సర్కులేట్ అవుతున్న ఫొటోలో స్నేహతో ఉన్న పిల్లాడు మా అబ్బాయి ఆర్యన్ కాదు. అతను మా మేనల్లుడు. దయచేసి అందరూ దాన్ని సర్కులేట్ చేయటం ఆపండి " అన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ..గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించటానికి తనను తాను రెడీ చేసుకుంటున్నాడు.

It is not my son's picture: Allu Arjun

మొదటి నుంచీ అల్లు అర్జున్‌.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని గుణశేఖర్‌ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.

''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం కథానాయకులలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది. వీరిపై జులైలో చిత్రీకరణ జరుపుతాం'' అంటూ వివరించారు గుణశేఖర్‌. ఈ సినిమాలో అనుష్క, రానా, నిత్యమీనన్‌, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

English summary

 Allu Arjun’s Facebook statement: "The kid in the pic, with Sneha, which is being circulated, is not Ayaan. He is my nephew. I request everyone to stop circulating it."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu