twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి': నేనే అని రమ్యకృష్ణ ఖరారు చేసింది

    By Srikanya
    |

    హైదరాబాద్ :రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు ‘బాహుబలి' రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని ‘బాహుబలి-ది బిగినింగ్' పేరుతో ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం బాహుబలిలో రమ్యకృష్ణ చాలా కీలక ప్రాధాన్యత ఉన్న శివగామి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తాజాగా డైలాగ్ టీజర్ ని విడుదల చేసారు. వీళ్ల తిరుగుగాటుతో మహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగేయ్ అంటూ ఆవేసంగా చెప్తున్న డైలాగు విడుదల చేసారు. ఈ డైలాగుకి రమ్యకృష్ణ స్వయంగా డబ్బింగ్ చెప్పింది. అయితే చాలా మంది వేరే వారు డబ్బింగ్ చెప్పారంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె వివరణ ఇచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    It Is Ramya’s Original Voice!!

    రమ్యకృష్ణ మాట్లాడుతూ... "మీ రెస్పాన్స్ కు అందరికీ ధాంక్స్. అది గాత్రమే. తెలుగు,తమిళ భాషల రెండింటికి నేనే డబ్బింగ్ చెప్పాను. అది కష్టంగానే ఉంది. కానీ నేను చాలా ఇష్టపడ్డాను",

    చిత్రం గురించి...

    తొలి చిత్రం నుంచి రాజమౌళి తన చిత్రాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ట్విస్ట్,గ్రాఫిక్స్, డైలాగులు, ఎమోషన్,యాక్షన్ ఇలా అన్ని కలగలపి ఆయన ఇంటర్వెల్ క్రియేట్ చేస్తూంటారు. అసలు ఆయన చిత్రాలు ఇంటర్వెల్ మొదట అనుకుని తర్వాత మిగతా కథ డిజైన్ చేస్తారా అన్నట్లు ఉంటాయి.

    ఈ నేపధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలిలో ఇంటర్వెల్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తకరమైన చర్చగా మారింది. అయితే ఈ సినిమాలో రెండు ఇంటర్వెల్ లు ఉంటాయి అంటున్నారు.

    అంటే రెగ్యులర్ గా వచ్చే ఇంటర్వెల్ ఒకటి...ప్రీ క్లైమాక్స్ సైతం ఇంటర్వెల్ స్దాయిలో కథను మలుపు తిప్పేలా డిజైన్ చేసారని, అక్కడ ఓ ట్విస్ట్ వస్తుందని, అలాగే...యాక్షన్ తో ప్రేక్షకుడు షాక్ కు గురి అవుతాడని అంటున్నారు. ఆ స్ధాయిలో రాజమౌళి ఈ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లను డిజైన్ చేసాడని చెప్పుకుంటున్నారు.

    తన డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావడం ఇష్టం లేకనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం మొత్తం 17 విఎఫ్ఎక్స్ స్టూడియోలు, 600 మంది ఆర్టిస్టులు పని చేసారు. అనుకున్న సమయానికి పని పూర్తి కాలేదని, అందుకే విడుదల ఆలస్యం అవుతున్నట్లు రాజమౌలి తెలిపారు.

    English summary
    Ramya Krishna said... “Thank you all for the great response. Yes it is my voice. I have dubbed for both Telugu and Tamil languages. It was tough. But I loved it", said Ramya Krishna, clearing peoples’ doubts over the voice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X