»   » ప్రతి గొట్టంగాడి గురించి ఎన్టీఆర్ పట్టించుకోవడం బాధేసింది: తమ్మారెడ్డి భరద్వాజ

ప్రతి గొట్టంగాడి గురించి ఎన్టీఆర్ పట్టించుకోవడం బాధేసింది: తమ్మారెడ్డి భరద్వాజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రివ్యూ రైటర్లపై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ మీద ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. దారినపోయే దానయ్యల్లాంటి సినీ విశ్లేషకులు ఎమర్జెన్సీ వార్డులో సినిమా ఉండగానే చనిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని, సినిమా చచ్చిందో లేదో తేల్చాల్సింది వైద్యం చేస్తున్న ప్రేక్షకులే అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ చేసిన ఈ మాటలకు బాధేసిందని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమాలపై సరైన విమర్శలు చేయని వ్యక్తుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు అలాంటి వారిని పట్టించుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్

ఎన్టీఆర్ చెప్పినట్లే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు. అసలు నేనంటాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? లేదా? అని మాట్లాడుకోవడం అనవసరం మనకు. సినిమా తీసిన తర్వాత అసలు అలాంటి వాళ్ల గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

మంచి సినిమాను ప్రేక్షకుడు బ్రతికించుకుంటాడు

మంచి సినిమాను ప్రేక్షకుడు బ్రతికించుకుంటాడు

డాక్టర్ కానటువంటి వాడు పేషెంట్ చచ్చిపోతాడని అంటే.... అతడు చచ్చిపోతాడా? బతికించుకునే వాళ్లను డాక్టర్ బతికించుకుంటాడు. అలానే, మంచి సినిమాను ప్రేక్షకుడు బతికిస్తారు... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ఎవడో గొట్టం గాడు అంట...

ఎవడో గొట్టం గాడు అంట...

ఎవడో గొట్టం గాడు చెప్పాడని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గొట్టం గాడి మాట పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ల గురించి ఆలోచించడం, మాట్లాడటం టైమ్ వేస్ట్.... అని తమ్మారెడ్డి సూచించారు.

బావుంది, బాగోలేదని చెప్పడంలో తప్పులేదు

బావుంది, బాగోలేదని చెప్పడంలో తప్పులేదు

విమర్శకుడనే వాడు సద్విమర్శ చేయాలి. సినిమా బాగుంది.. బాగోలేదు. సినిమా బాగుంటే ఎందుకు బాగుంది, బాగుండకపోతే ఎందుకు బాగోలేదో తన వరకు తాను ఎవరైనా చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు అని తమ్మారెడ్డి అన్నారు.

అలాంటి హక్కు విమర్శకుడికి లేదు

అలాంటి హక్కు విమర్శకుడికి లేదు

సినిమా ఎందుకు బాగోలేదో, ఎందుకు బావుందో విశ్లేషించే హక్కు మాత్రమే సినీ విమర్శకుడికి ఉంది. సినిమా ఫెయిల్ అయిపోయింది, లేక పోతే ఇన్ని కోట్లు వస్తాయి, డిపాజిట్లు రావు, పిండి ఖర్చులు రావు అని చెప్పే హక్కు లేదు, వాళ్లు అసలు విమర్శకులే కాదు అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

నిజంగా బాధేసింది

నిజంగా బాధేసింది

సద్విమర్శలు చేయని వారి గురించి మనం మాట్లాడుకోవడం, ఎన్టీఆర్ లాంటి పెద్దస్టార్ అలాంటి వారిని పట్టించుకోవడం అనేది నిజంగా బాధేసింది". అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

English summary
Tammareddy Bharadwaja has reacted on Jr NTR comments, by stating that there is no need for a huge star like Jr NTR to give importance to the reviewers who do not review properly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X