»   » కళ్లద్వారానే యాక్షన్ పండించాలి: రామ్ గోపాల్ వర్మ

కళ్లద్వారానే యాక్షన్ పండించాలి: రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనంతపురం ఫ్యాక్షన్‌ కక్షల నేపథ్యంలో సూర్య, వివేక్‌, ప్రియమణి ముఖ్య పాత్రధారలుగా రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మించిన చిత్రం 'రక్తచరిత్ర". దీని తొలిభాగం ఇటీవలే విడుదలై పలు వివాదాలను సృష్టించింది. రెండో భాగం కూడా డిసెంబర్‌ 3న రిలీజ్‌ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా వర్మ చెప్పిన విశేషాలు మీ కోసం. ఇద్దరు నటులు వేరు వేరు పాత్రలు పోషించినప్పుడు ఎవరు బాగా చేశారో చెప్పడం సాధ్యం కాదు. వివేక్‌, సూర్య తమ పాత్రలకు న్యాయం చేశారు. 'రక్త చరిత్ర" రెండో భాగంలో మాత్రం సూర్య పాత్ర కీలకమైంది. జైల్లో కూర్చుని పగతో ప్రణాళికలు వేసే వ్యక్తిలో భావాలు కనిపించేది కళ్లలోనే. కళ్లద్వారానే యాక్షన్‌ పండించాలి. ఆ శక్తి సూర్య కళ్లల్లో కనిపించింది. సూర్య భార్యగా ప్రియమణి నటించింది. భానుమతి ఈ పాత్రకు స్ఫూర్తి. 'రక్త చరిత్ర" మూడో భాగం రూపొందించినా ఆశర్చర్యపడక్కర్లేదు" అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu