»   » శాతకర్ణి ఎఫెక్ట్: క్రిష్ ఇంటిపై ఐటి దాడి, నితిన్ తండ్రికి సెగ!

శాతకర్ణి ఎఫెక్ట్: క్రిష్ ఇంటిపై ఐటి దాడి, నితిన్ తండ్రికి సెగ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సూపర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్స్ నమోదు చేస్తూ బాక్సాఫీసు వద్ద జైత్రయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 60 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

ఈ వసూళ్ల ఎఫెక్టుతో ఆదాయపు పన్ను శాఖ కన్ను ఈ చిత్రంపై పడింది. మంగళవారం ఈ చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి, ఈ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కార్యాలయాలపై అధికారులు దాడి చేసారు. దీంతో పాటు దర్శకుడు క్రిష్ ఇంటిపై కూడా దాడి చేసారు.  పెద్ద సినిమాలు రిలీజైన సమయంలో ఇలాంటి మామూలే అని, వారు టాక్స్ సరిగా చెల్లిస్తున్నారో? లేదో? చెక్ చేయడానికే రైడ్స్ జరుగుతుంటాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

IT raids on Gautamiputra Satakarni producer

బాలయ్య కెరీర్లో 100వ చిత్రంగా తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం బాలయ్య కోరీర్లోనే అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. చరిత్రలో గుర్తుండి పోవాలనే ఉద్దేశ్యంతో రెగ్యులర్ సబ్జెక్టు కాకుండా ఈ డిఫరెంట్ స్టోరీ బాలయ్య ఎంచుకున్నారు.

దర్శకుడు క్రిష్ పక్కా ప్లానింగ్ ప్రకారం చాలా తక్కువ రోజుల్లోనే ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. క్రిష్ కెరీర్లో కూడా ఇది పెద్ద హిట్.

English summary
Income Tax officials on Tuesday raided the office of Gautamiputra Satakarni producer Rajeev Reddy and the office of the film's Nizam distributor Sudhakar Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu