హీరోయిన్ జెనీలియాకు మళ్లీ బాబు పుట్టాడు...
హైదరాబాద్: హీరోయిన్ జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లాడటం, వీరికి రియాన్ అనే బాబు జన్మించడం...జెనీలియా రెండోసారి గర్భం దాల్చడం తెలిసిందే. తాజాగా జెనీలియా ప్రసవించింది. మరో బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆము భర్త నటుడు రితేష్ దేశ్ ముఖ్ ట్విట్టర్ ద్వారా పోస్టు చేసాడు.
ఇక 'తుజే మేరీ కసమ్'(తెలుగు నువ్వే కావాలి రీమేక్) చిత్రంతో రితేశ్, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. 2014 నవంబర్ లో వీరికి రియాన్ జన్మించాడు.

బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమని ప్రకటించింది. ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందనే ఆనందం అభిమానులకు ఎంతో కాలం నిలవలేదు. జెనీలియా మళ్లీ గర్భం దాల్చడం, తాజాగా మరో బాబుకు జన్మనివ్వడంతో ఆమె ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశాలే లేవని తేలిపోయింది. జెనీలియా ఎక్కువ పాపులర్ అయింది సౌత్ లోనే. ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు కలిసి రాలేదు.


Click it and Unblock the Notifications











