»   » 24 గంటల్లో 'భాయ్' టీజర్ రికార్డ్ ఇదీ..

24 గంటల్లో 'భాయ్' టీజర్ రికార్డ్ ఇదీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ :అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నాగార్జున హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న 'భాయ్' సినిమాకు సంబంధించి ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వీరభద్రమ్ మీడియాకు తెలియచేసారు.

వీరభద్రమ్ మాట్లాడుతూ "కేవలం 24 గంటల్లోనే 2.50 లక్షల హిట్స్ టీజర్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీజర్‌లో 'హైదరాబాద్‌కి రెండే ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్, ఒకటి భాయ్', 'ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చెయ్యాలంటే ఈ భాయేరా', 'ఎట్మాస్పియర్ ఎలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటర్ అయినట్టే' అనే నాగార్జున డైలాగ్స్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి గొప్ప బేనర్‌లో, నాగార్జున వంటి స్టార్‌తో సినిమా చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా నాగార్జున అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుంది. సెప్టెంబర్ 1న పాటల్నీ, నెలాఖరులోగా సినిమానీ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి'' అని చెప్పారు.

భాయ్' మూవీ తెలుగుతో పాటు తమిళ అనువాదంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలోనూ ఈచిత్రాన్ని 'భాయ్' పేరుతోనే విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 'భాయ్' సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.


నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నథాలియా కౌర్, కామ్నా జెఠ్మలానీ, హంసానందిని, సోనూ సూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఆదిత్య మీనన్, సుప్రీత్, అజయ్, నాగినీడు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, జయప్రకాశ్‌రెడ్డి, జరాసా, చలపతిరావు, రాహుల్‌దేవ్, వెన్నెల కిశోర్, ప్రసన్న, హేమ, గీతాంజలి, శ్రావణ్ తారాగణం. ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్. సాయిబాబు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్.

English summary
Nagarjuna upcoming film Bhai teaser has been released and got good response.Nagarjuna looks stylish in the teaser and the one liner are quite impressive. Here the one liners of the teaser ‘Atmosphere Alert Ayindante Bhai Enter Ayinatte’, ‘Hyderabad lo Rende Famous, Okati Irani Chai, Rendodhi Bhai’, ‘Ee Field lo Kothaga Evaraina Edaina Try Cheyalante Nene Ra’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu