For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అది మా సినిమా టైటిల్ కాదు

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఫలానా టైటిల్ సినిమాకు పెడుతున్నారంటూ మీడియాలో రావటం, రెండో రోజో,మూడో రోజో ఆ దర్శకుడో లేదా ఆ నిర్మాత వెంటనే అలాంటిదేమీ లేదు..మాకు వేరే టైటిల్ ఉందని వివరణ ఇవ్వటం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా చాలా కామన్ అయ్యిపోయింది. ఆ వంకతో కాస్తంత మీడియాలో తమ సినిమా నలుగి ఫ్రీ పబ్లిసిటి వస్తుంది కదా అని కొందరు నిర్మాతలు, దర్శకులు ఆనందపడుతూంటే కొందరు మాత్రం మాది కాని టైటిల్ తో మా సినిమాను ఎందుకు పబ్లిక్ లోకి తెస్తారని విసుక్కుంటున్నారు. తాజాగా అలాంటి సమస్యే నాగ చైతన్య తాజా చిత్రానికి ఎదురయ్యింది.

  వివరాల్లోకి వెళితే... సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న సినిమాకు ‘హరిలో రంగ హరి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిని దర్శకుడు ఖండించారు. సినిమాకి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదని తెలిపారు. సినిమా టైటిల్ ఖరారు చేయగానే ట్విట్టర్ లో వెల్లడిస్తామని అన్నారు. అప్పటి వరకు రూమర్స్ ప్రచారం చేయవద్దని కోరారు.

  సుధీర్ వర్మ ట్వీట్ చేస్తూ... ‘హరిలో రంగ హరి' టైటిల్ మాది కాదు..ఒక సారి టైటిల్ ఫైనల్ అయ్యాక మేమే తెలియచేస్తాం..రూమర్స్ దయచేసి ప్రచారం చేయవద్దు.. ఆ టైటిల్ వేరే వారిది అని అన్నారు.

  ఇక యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారని చెప్తున్నారు. చైతన్య సరసన ‘1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు.

  It's not our Title: Sudheer Varma

  మొదటినుంచీ ఈ సినిమాకి ‘మాయగాడు' , దొరకడు అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దర్శక,నిర్మాతలు ఖండిస్తూ వచ్చారు. ‘హరిలో రంగ హరి' టైటిల్ దొరకకపోతే ఈ టైటిల్స్ తో ఏదో ఒక దానితో ముందుకెళ్లే అవకాసముందని చెప్తున్నారు. అయితే అటువంటిదేమీ లేదని దర్శకుడు సుధీర్ వర్మ ఖండిస్తున్నారు.

  'స్వామి రా రా' అంటూ తొలి ప్రయత్నంతోనే ఆకట్టుకొన్నారు సుధీర్‌ వర్మ. 'తడాఖా', 'మనం'... అంటూ విజయాల బాట పట్టారు నాగచైతన్య. వీరిద్దరూ మరో విజయం కోసం జట్టు కట్టారు. నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతిసనన్‌ హీరోయిన్. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత.

  నాగచైతన్య మాట్లాడుతూ ''సుధీర్‌ వర్మ తీసిన 'స్వామి రా రా' నాకు బాగా నచ్చింది. నా కోసం ఓ మంచి కథ సిద్ధం చేశాడు. తప్పకుండా నా కెరీర్‌లో మంచి చిత్రంగా మిగులుతుందన్న నమ్మకం ఉంద''న్నారు.

  దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ 'అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన ప్రసాద్ గారి బేనర్లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి రారా తర్వాత నేను చేస్తున్న ఈ సినిమా నాగ చైతన్యకు పూర్తి యాప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది' అన్నారు.

  ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రావు రమేష్, ప్రవీణ్, పూజ, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: సన్నీ ఎం.ఆర, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: నారాయణరెడ్డి, పాటలు: శ్రీమణి, కృష్ణ చైతన్య, కో డైరెక్టర్: విజయ్ సిహెచ్, స్టిల్స్: శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్ ఈదర, సమర్పణ: బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ.

  English summary
  sudheer varma tweeted: "HariloRangaHari is also not our title... Wil tweet Once we finalise the title.. Plz dont spread rumours.. Its someone else's title"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X