For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వారిని స్ఫూర్తిగా తీసుకొనే పాత్రల్ని రాస్తా: శ్రీను వైట్ల

  By Srikanya
  |
  Sreenu Vaitla
  హైదరాబాద్ : ''నాపై జంధ్యాల, ఇ.వి.వి.సత్యనారాయణ లాంటి దర్శకుల ప్రభావం చాలా ఉంది. నా ఆలోచనల్లోని మాస్‌ అంశాలకు... ఆ దర్శకుల తరహాలో వినోదాలు జత చేస్తుంటాను. నిజ జీవితంలో కొద్దిమంది సరదా వ్యక్తులు తారసపడుతుంటారు. వారిని స్ఫూర్తిగా తీసుకొనే నేను పాత్రల్ని రాసుకొంటుంటా'' అంటున్నారు శ్రీను వైట్ల. మంగళవారం శ్రీనువైట్ల జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  అలాగే ''ఏ ఒక్క వర్గాన్నో మెప్పించడం నాకు ఇష్టముండదు. థియేటర్‌కి వచ్చిన ప్రతీ ప్రేక్షకుడూ సంతృప్తిగా బయటికి వెళ్లాలి. కాస్త ఆలస్యమైనా... ఆ తరహా కథల్నే నేను సిద్ధం చేసుకొంటాను''అని చెప్తున్నారు శ్రీనువైట్ల. ప్రస్తుతం మహేష్‌బాబుతో తీయబోయే 'ఆగడు' అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందంటున్నారాయన.


  ఇటీవల ఎన్టీఆర్‌ని 'బాద్‌షా'గా శ్రీను వైట్ల చూపించారు. ప్రస్తుతం మహేష్‌బాబు కథానాయకుడిగా 'ఆగడు' సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. 'దూకుడు' తర్వాత మహేష్‌బాబుతో చేస్తున్న చిత్రమిది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ప్రతీ సినిమాలోనూ వినోదానికి అగ్రతాంబూలం ఇచ్చే శ్రీనువైట్లకి స్వతహాగా యాక్షన్‌ అంశాలంటేనే ఇష్టమట. తెరపై హీరోయిజాన్ని చూపించే కథాంశాలనే ఇష్టపడతారు.


  శ్రీనువైట్ల తెరపై గమ్మత్త్తెన పాత్రల్ని సృష్టిస్తుంటారు. చక్కటి వినోదాల్ని పంచిపెట్టాయి. ఆ పాత్రల పేర్లు తలచుకొంటేనే నవ్వొస్తుంటుంది. సాల్మన్‌రాజు, మెక్‌డొనాల్డ్‌ మూర్తి, డల్లాస్‌ నాగేశ్వరరావు, బొక్కా వెంకట్రావు తదితర పాత్రలు తెరపై కావాల్సినంత సందడి చేశాయి. ఇలాంటి పాత్రలూ ఆగడులో చూడవచ్చు అని చెప్తున్నారు. డిఫెరెంట్ గా వెళ్తూ తన తరహా ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటున్నారు.

  ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొన్న దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన సినిమాలకి వెళితే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలగచేసారు. అంతే కాదు... తెరపై హీరోయిజాన్ని చూపించడంలోనూ ఓ ప్రత్యేకమైన శైలిని ప్రదర్శిస్తూ ఉండటంతో స్టార్ హీరోలంతా ఆయన దర్శకత్వంలో చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటుంటాయి ఆయన సినిమాలు.వరుస విజయాలతో ఆయన ప్రయాణం ఇలాగే కంటిన్యూ అవ్వాలని, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

  English summary
  Director Sreenu Vaitla's birthday is today. The director who is popular for making stylish action entertainers is celebrating his 41th birthday today(September 24). Srinu Vaitla has decided to celebrate this birthday with his family, friends in Hyderabad today. On this occasion, let's wish Sreenu Vaitla a very happy birthday and all success in the days to come.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more