»   » కావాలని చేసిన తప్పు కాదది...అనుష్క వివరణ

కావాలని చేసిన తప్పు కాదది...అనుష్క వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాంకి ట్విట్టర్‌లో నివాళులర్పించే క్రమంలో ఆయన పేరును తప్పుగా రాసి బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ విమర్శలపాలైన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలోనూ,సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారమే రేగింది. ఈ విషమయై ఆమె వివరణ ఇచ్చారు.

కలాం పేరు తప్పుగా రాయాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు. మనుషులన్నాక తప్పులు చేయడం సాధారణమే కదా అని ఆమె అన్నారు. తాను చేసింది ఆనెస్ట్‌ మిస్టేక్‌ అని అనుష్క పేర్కొన్నారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గుండెనొప్పితో సోమవారం మృతిచెందారు. ఆయనకు ట్విట్టర్‌లో నివాళులర్పిస్తూ అనుష్క కలాం పేరును 'ఏపీజే' కి బదులుగా 'ఏబీజే' అని, అబ్దుల్‌ కలాం 'ఆజాద్‌' అని రెండుసార్లు తప్పుగా ట్వీట్‌ చేశారు. అనంతరం ఆ ట్వీట్స్‌ని తొలగించి మూడోసారి కరెక్టుగా రాశారు. దీంతో ఆమెని విమర్శిస్తూ పలువురు వ్యాఖ్యలు రాశారు.

It was an ‘honest mistake': Anushka Sharma

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రెండో సారీ కలాం పేరు తప్పుగానే రాసింది. అనంతరం ఆ ట్వీట్‌ని కూడా తొలగించి, మూడోసారి కలాం పేరు సరిగా రాస్తూ నివాళులర్పించింది. అప్పటికే అనుష్క... రెండు సార్లు తప్పుగా రాయడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీసం మూడోసారికైనా సరిగా రాశావు సంతోషం అంటూ ఒకరు, మూడోసారైనా సరిగా రాసి.. ట్వీట్‌ని తొలగించవని అనుకుంటున్నా.. అని మరొకరు అలా ఆమె ట్వీట్లపై విమర్శలు గుప్పించారు. ఫైనల్ గా సరిగ్గా ట్వీట్ చేసింది.

English summary
Anushka Sharma who landed in a controversy after misspelling former president A P J Abdul Kalam’s name in her tweets, termed her action as “an honest mistake” while maintaining that her intention and feelings should not be misconstrued.
Please Wait while comments are loading...