దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తోన్న సినిమా సవ్యసాచి. చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా పై చైతు మంచి హోప్స్ పెట్టుకున్నాడు. ప్రేమమ్ సినిమా తరువాత చందు మొండేటి, చైతు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమపై మంచి అంచనాలు ఉన్నాయి.
అక్కినేని నాగార్జున కెరీర్‌లో మంచి హిట్ సినిమాగా నిలిచిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసి పాటను చైతు రీమిక్స్ చెయ్యబోతున్నాడు. రమ్యకృష్ణ, నాగార్జున నటించిన ఈ పాట అప్పట్లో మంచి పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ ను సవ్యసాచి లో పెట్టబోతుండడం విశేషం.
ఈ పాటలో ఒక ప్రముఖ కథానాయిక నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సాంగ్ లో తమన్నా లేదా రకుల్ నటించే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. కాని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సాంగ్ కోసం ఇంతవరుకు ఎవ్వరిని ఖరారు చెయ్యలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.