For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఫీషియల్ : బ్రేక్ అప్ ని సమంత కన్ఫర్మ్ చేసింది

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రేమ పక్షలు....సమంత,సిద్దార్దల మధ్య బ్రేక్ అప్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇంగ్లీష్ మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై సమంత స్పందించింది. ఆమె ట్వీట్ చేస్తూ... "ఈ ఆర్టికల్ నన్ను ఓ విక్టమ్ గా చూపించింది. నేను మాత్రం కాదు. సిద్దార్ద గొప్పవాడు. మీడియా దయచేసి ఇలాంటివి చేయద్దు.. ఇది నా పర్శనల్. ఈ విషయమై ఎలాంటి కామెంట్స్, వివరణలు నా రిలేషన్ షిప్ పై వద్దు. ధాంక్యూ ." అంటూ స్పందించింది. అయితే ఈ క్రమంలో ఆమె బ్రేక్ అప్ ని ఖరారు చేసినట్లైంది.

  పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

  ఆ దినపత్రిక ఈ బ్రేక్ అప్ ని ప్రస్దావిస్తూ... "ఇది సమంతకు చాలా బాధాకరమైన అనుభవం...దీన్నించి కోలుకోవటానికి సమయం పడుతుంది..ఆమె కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది ". అంటూ రాసుకొచ్చింది. దానిపై తన బ్రేక్ అప్ ని అఫీషియల్ గా ఖరారు చేస్తున్నట్లు గా స్పందిస్తూ ఇలా రాసుకొచ్చింది సమంత.

  ఇక రేపో మాపో పెళ్లి చేసుకుంటారంటారనుకుంటున్న సిద్దార్ద,సమంత విడిపోయారా...అవునంటూ బాలీవుడ్ మీడియా, మన ఆంగ్ల దినపత్రికలు రాస్తున్నాయి. వాస్తవానికి సమంత, సిద్దార్ద మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ చాలా కాలంగా మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఈ విషయం కామన్ అనే నిర్ణయానికి వచ్చి...ఎవరూ పట్టించుకోవటం లేదు. అంతేకాకుండా త్వరలో వారిద్దరూ పెళ్లాడబోతున్నారని వివాహ తేదీలతో సహా వార్తలు వచ్చేసాయి. ఈ లోగా ఈ షాకింగ్ న్యూస్ బయిటకు వచ్చింది.

  Its Official: Samantha & siddhartha breakup!

  వీరిద్దరూ తాము క్లోజ్ ఫ్రెండ్స్ మని చెప్తున్నా...వీరిద్దరూ బంధం వివాహానికే దారి తీస్తుందని భావించారు అంతా. 2016లో వీరి వివాహం అనుకున్నారు. సమంత కూడా అప్పుడే పెళ్లి చేసుకుంటానని అంది. అయితే డిసెంబర్ 2014లో వీరిద్దరి మధ్యా పొరపొచ్చాలు చోటు చేసుకున్నట్లు చెప్తున్నారు. కానీ కెరీర్ కోసమే ఈ బ్రేక్ అప్ నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. సిద్దార్ద గతంలో.. డేటింగ్ చేసిన శ్రుతి హాసన్, సోహ అలీ ఖాన్ లతో బ్రేక్ అప్ చేసుకున్న సంగతి తెలిసిందే.

  గతంలో సిద్దార్ధ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పిల్లలు, కుటుంబం కావాలని కోరుకుంటున్నానని, తనకల త్వరలో వాస్తవ రూపు దాల్చబోతోందని చెప్పుకొచ్చాడు. దాంతో అందరి దృష్టీ సమంత పై మళ్లింది. ఇక ఇప్పటికే ... పలువురు హీరోయిన్‌లను తనతో ముడిపెట్టి మీడియా రాసిందని, అయితే వాటన్నింటికీ ప్రతిస్పందించగూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.

  తన కుటుంబ సభ్యులు ఇలాంటి వార్తలను పట్టించుకోరని తెలిపారు. అయితే సిద్దార్ధ ఖచ్చితంగా సమంతనే పెళ్ళి చేసుకోబోతున్నట్లు ఫిలిమ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. దానికితోడు వారిద్దరూ ఇటీవల శ్రీకాళహస్తి దేవాలయానికి కలిసివెళ్ళి రాహుకేతు పూజ చేయించడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయింది.

  సిద్దార్ధ...ఇప్పటికే ఒక పెళ్ళి అయి విడాకులు తీసుకున్న సిద్దార్ధ తమిళనాడుకు చెందిన హిందూ కాగా, సమంత కేరళకు చెందిన క్రిస్టియన్‌. సిద్దార్ధ కొంతకాలంక్రితం కమలహాసన్‌ కుమార్తె శృతిహాసన్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఏమయిందో, ఏమోగానీ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు.

  ఇంతకు ముందు సమంత మాట్లాడుతూ..... సిద్దార్థ్ తనకు మంచి మిత్రుడని, అంతకు మించి తామిద్దరి మధ్య ఇంకేమీ లేదని సమంత స్పష్టం చేశారు. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, ఈ గాసిప్పుల వల్ల తన నిర్మా తలు ఆందోళన చెందుతారనే ఉద్దేశంతోనే ఈ వివరణ ఇస్తున్నానని ఈ సందర్భంగా సమంత చెప్పారు. అంతేగాక''మా వ్యక్తిగత విషయాలపై మీడియా అత్యుత్సాహం చూపించడం చాలా బాధాకరం. దాచుకోవాల్సినంత రహస్యమైన విషయాలేమీ నా దగ్గర ఉండవు. ప్రేమ, పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైనవి. నా విషయంలో ఏది జరిగినా అమ్మానాన్నల ప్రమేయంతోనే జరుగుతుంది'' అని చెప్పారు

  ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయని, తన ఆలోచనలు మొత్తం పాత్రల చుట్టూనే తిరుగుతున్నాయని సమంత అన్నారు. సిద్దార్ద మాత్రం ..." నా ప్రెవేట్ లైఫ్ కి చెందిన రూమర్స్...గురించి అయితే నేనే ఏదన్నా చెప్పుకోతగ్గ విషయం ఉంటే షేర్ చేసుకుంటాను... అలా రూమర్స్ వ్యాపింప చేయటం మాత్రం పద్దతి కాదు...." అని ట్వీట్ చేసారు. అయితే సమంత లవ్ ఎఫైర్ విషయమై మాత్రం ఆయన ఖండించకపోవటం గమనార్హం.

  English summary
  Responding to the article, Samantha commented, "The article makes me look like the victim. I am not. Siddharth is a great guy. Media stop taking sides. This is personal. STOP. There will be no further clarifications or comments about my relationship. Thank you."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X