»   » అఫీషియల్ :వరుణ్ తేజ,క్రిష్ చిత్రం టైటిల్ ఇదే(ముహూర్తం షాట్)

అఫీషియల్ :వరుణ్ తేజ,క్రిష్ చిత్రం టైటిల్ ఇదే(ముహూర్తం షాట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కంచె అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ టైటిల్ ని ఖరారు చేస్తూ ఇదిగో ఈ ఫోటో ని చూడండి. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిస్తుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ సినిమా ముహూర్త కార్యక్రమం ఫిబ్రవరి 27న అంటే ఈ రోజున జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత.

Its Official: Varun Tej's 2nd Flick Title!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమా ముహూర్త కార్యక్రమం ఫిబ్రవరి 27న జరుగుతుంది. రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకు ‘కంచె' అనే టైటిల్ పరిశీలనలో ఉందట.

ఈ విషయమై వరుణ్ తేజ ట్వీట్ చేస్తూ ‘హే ట్వీప్స్...నా తర్వాతి సినిమా ఈ నెల 27న ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని క్రిష్ హ్యాండిల్ చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది' అని వరుణ్ తేజ్ ప్రకటించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు. అయితే ముందుగా క్రిష్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుంది.

English summary
Varun Tej's second flick 'Kanche' has been launched Today. Touted to be a period drama, This film is set in the pre-Independence era.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu