బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌గా నరేంద్ర
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందుతున్న నరేంద్ర చిత్రంలో అంతర్జాతీయ బాక్సర్ ది గ్రేట్ ఖలీ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు వస్తున్నాడు. ఈ సినిమా గురించి తనపై వస్తున్న వార్తలపై ఇజాబెల్లే స్పందించారు. నరేంద్ర చిత్రంలో నటించడం లేదని చెప్పారు.
మిస్టర్ మజ్నులో గెస్ట్‌గా ఇజా
మిస్టర్ మజ్ను సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన తర్వాత నేను తెలుగులో ఏ చిత్రంలో నటించలేదు. ఒకవేళ నేను ఏదైనా సినిమాను అంగీకరిస్తే నా ఫ్యాన్స్‌కు తెలియజేస్తాను. కొన్ని సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏవీ ఫైనల్ కాలేదు అని ఇజాబెల్లే చెప్పారు.
నన్ను ఎవరూ సంప్రదించలేదు
నరేంద్ర సినిమా గురించి ఓ విషయం చెప్పదలచుకొన్నాను. ఈ సినిమాలో నేను నటించడం లేదు. ఇప్పటి వరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇస్తున్నాను అని సోషల్ మీడియాలో ఇజాబెల్లే తెలిపారు.
విజయ్ దేవరకొండతో కలిసి
మిస్టర్ మజ్నులో గెస్ట్ రోల్‌లో కనిపించిన ఇజాబెల్లే ప్రస్తుతం విజయ దేవరకొండ సరసన మరో చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది.