»   » జెకె భారవి చిత్రంలో హీరోలు వీళ్ళా?

జెకె భారవి చిత్రంలో హీరోలు వీళ్ళా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో అన్నమాచార్య,మంజునాధ,శ్రీరామదాసు వంటి భక్తి రస చిత్రాలకు స్క్రిప్టు అందించిన జె.కె.భారవి దర్సకుడుగా ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.'శ్రీ జగద్గురు ఆదిశంకర"టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన పవర్ ఫుల్ హీరోలు నటిస్తారని ప్రకటించారు.అంతా ఎవరా హీరోలు అని ఆసక్తిగా ఎదురుచూసారు.ఇంతకీ ఆ హీరోలు ఎవరంటే శ్రీహరి,సుమన్, కౌశిక్.నారా జయశ్రీదేవి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.తొలి షాట్‌కు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా హీరో నాగార్జున స్విచాన్ చేశారు.

సాయికుమార్, జెడి చక్రవర్తి, అలీ, మురళీమోహన్,శ్రీధర్,వాసు, గిరీష్ కర్నాడ్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, శరత్‌బాబు, నాజర్, ధర్మవరపు, ఎవిఎస్, ఎల్.బి.శ్రీరాం, ఎమ్మెస్ నారాయణ, రఘు బాబు, అనంత్, చిట్టిబాబు, సురేష్ దండనాయకుల, మీనా, జయప్రద, కోవైసరళ, శివపార్వతి, హేమ, సుధ, మంజుభార్గవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీం: నాగ్ శ్రీవత్స, కెమెరా; పికెహెచ్ దాస్, పాటలు: ఆదిశంకరాచార్య, శ్రీ వేదవ్యాస, జె.కె.భారవి, నిర్మాత: నారాజయశ్రీదేవి. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.కె.భారవి.

English summary
J K Bharavi is all set to direct a devotional film titled ‘Sri Jagadguru Aadishankara’ under Global Peace Creators banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X