For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాగబాబు బిక్షం వేస్తేనే నువ్వు అప్పుడు గెలిచావ్: శివాజీ రాజాపై హైపర్ ఆది ఫైర్!

|
Hyper Aadi Reacts Sivaji Raja's Comments Against Naga Babu || Filmibeat Telugu

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మెగాబ్రదర్ నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తులని, నాగబాబు మంచి వాడు కాదని, అతడికి నరసాపురం నియోజకవర్గ ప్రజలు ఓటు వేయవద్దంటూ శివాజీ రాజా ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు నాగబాబు వెన్నుపోటు దారుడు, పిల్లికి బిక్షం కూడా వేయడు.. అలాంటి వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడనే నమ్మకం పెట్టుకోవద్దు అంటూ శివాజీ రాజా తీవ్ర పదజాలంతో నాగబాబును టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది నాగబాబుకు మద్దతుగా శివాజీ రాజాకు కౌంటర్ ఇచ్చారు.

అలా చేస్తే చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కి నచ్చుతుందా?

అలా చేస్తే చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కి నచ్చుతుందా?

‘‘శివాజీ రాజా గారూ ఒక సీనియర్ ఆర్టిస్టుగా మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ మీరు నాగబాబు గురించి మాట్లాడినదాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. మీరు ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. చిరంజీవిగారంటే చాలా ఇష్టమని అంటున్న మీరు... నాగబాబు గారిని తిడితే చిరంజీవిగారికి నచ్చుతుందా? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారంటే నాకు ప్రాణమని చెబుతున్నారు.. ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన నాగబాబు గారికి ఓటు వేయవద్దు అని మీరు చెబితే పవన్ కళ్యాణ్ గారికి నచ్చుతుందా?'' అని హైపర్ ఆది ప్రశ్నించారు.

ఆయన బిక్షం వేస్తేనే నువ్వు గెలిచావ్

ఆయన బిక్షం వేస్తేనే నువ్వు గెలిచావ్

‘‘పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవిగారిని పొగిడి నాగబాబు గారిని తిడితే మా లాంటి మెగా అభిమానులకు నచ్చుతుందా? ఈ విషయాలన్నీ శివాజీ రాజా ఆలోచించాలి.. ఒక పెద్ద వ్యక్తిగా, సీనియర్ ఆర్టిస్టుగా ఈ మాత్రం ఆలోచించలేని వ్యక్తి మీరు అనుకోవడం లేదు. మీరు ఇంకో మాట అన్నారు... నాగబాబు పిల్లికి బిక్షం వేయడు అని, నువ్వు రెండు సంవత్సరాలు మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా చేశావు. అది నువ్వు ఎవరి బిక్షం వేస్తే చేశావ్. ఆయన బిక్షం వేస్తేనే చేశావు.'' అని ఆది ఫైర్ అయ్యారు.

నాగబాబు ఎంతో మందికి సహాయం చేశారు

నాగబాబు ఎంతో మందికి సహాయం చేశారు

‘‘జబర్దస్త్‌లో ఒక ఆర్టిస్టుకి కిడ్నీ ఫెయిల్ అయితే నాగబాబు గారు రూ. 10 లక్షల సాయం చేశారు. మీకు ఏం తెలుసని అంత మాట అంటారు? ఎంత మందికి ఎన్ని సహాయాలు చేశారో నాగబాబు గురించి మీకు తెలుసా? సినిమా ఇండస్ట్రీ కానీ, బయటి వారు కానీ నాగబాబు గురించి ఒకే మాట చెబుతారు. మంచి మనసున్న కల్మషం లేని మనిషి అని.. అది తెలిసి కూడా మీరు ‘మా' ఎన్నికల్లో ఓడిపోయారనే అక్కసుతో ఇలా మాట్లాడుతున్నారు.'' అని ఆది చెప్పుకొచ్చారు.

వెన్ను పోటు అంటే మీదే...

వెన్ను పోటు అంటే మీదే...

‘‘నాగబాబు గారు మీకు వెన్నుపోటు పొడిచారా? ‘మా'లో కొత్త మార్పు కావాలని కొత్త ప్యానల్ కు సపోర్ట్ చేశారు. అలా అనుకోవడం తప్పా? మీకు సపోర్టు చేయలేదంటే దాన్ని వెన్ను పోటు అనడం కరెక్టా? అసలు వెన్నుపోటు అంటే మీకు మీనింగ్ తెలుసా? మీరు ఓడిపోయారనే అక్కసుతో అంతకు ముందు మిమ్మల్ని గెలిపించారన్న విషయాన్ని కూడా మరిచిపోయి మీరు మాట్లుడుతున్నారే.. అదీ వెన్నుపోటు.'' అంటూ శివాజీ రాజాను ఏకిపారేశారు.

నోరు అదుపులో పెట్టుకోండి

నోరు అదుపులో పెట్టుకోండి

‘‘నాది నరసాపురం, నాగబాబు అలా మాట్లాడితే ఊరు నుంచి తిరిమి తరిమి కొడతారు అని మరో మాట అన్నారు. ఒక్కసారి నరసాపురం సెంటర్లోకి వచ్చి మీరు, నాగబాబు నిలబడండి... ఎవరిని తరిమి కొడతారో అది కూడా చూద్దాం. శివాజీ రాజా గారూ మాట అదుపులో పెట్టుకోండి. మీకు అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి నాగబాబు గారితో అనుబంధం ఉందో, ఫ్రెండ్షిప్ ఉందో మాకు తెలియదు. మేము 5 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూశాం. ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి మాకు తెలుసు. ఆయన కల్మషం లేని మనస్తత్వం గురించి మాకు తెలుసు. మీరు మాట్లాడేపుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి.'' అంటూ ఆది హెచ్చరించారు.

బిస్కెట్లు వేయడం ఆపు

బిస్కెట్లు వేయడం ఆపు

‘‘నాగబాబుగారి నడక గురించి కూడా ఓ మాట అన్నారు. ఆయన కిచెన్లో నుంచి బయటకు రావడానికి అరగంట పడుతుంది, కారెక్కడానికి అరగంట పడుతుంది.. ఇక ప్రజా సమస్యలు ఏం తీరుస్తారు అని.. ఇవన్నీ అనే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరంటే ఎవరికీ నచ్చకే మిమ్మల్ని ఎవరూ గెలిపించలేదు. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడకండి. మెగా ఫ్యామిలీలో నాకు చిరంజీవి ఇష్టం, పవన్ కళ్యణ్ అంటే ఇష్టం అంటూ బిస్కెట్లు వేసి నాగబాబు గారిని తిట్టాల్సిన అవసరం లేదు. మీరు ఓడి పోయారనే అక్కసుతో మాట్లాడుతున్నారు అనేది జనాలకు తెలుసు.'' అని ఆది వ్యాఖ్యానించారు.

English summary
MAA ex President Shivaji Raja has made controversial comments on senior actor Naga Babu. Reacting to this comments, Jabardasth comedian Hyper Aadi has give countered the Sivaji Raja.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more