»   » షూటింగులో గాయపడిన జబర్దస్త్ షేకింగ్ శేషు

షూటింగులో గాయపడిన జబర్దస్త్ షేకింగ్ శేషు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ ఫేం షేకింగ్ శేషుకు సినిమా షూటింగ్‌లో గాయాలైనట్లు తెలుస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్న సుప్రీం చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఛేజింగ్ సీన్ షూట్ చేస్తుండగా జిప్సీ వాహనం బోల్తా పడి శేషుకు గాయాలైనట్లు సమాచారం.

ప్రస్తుతం శేషు హైదరాబాదులోని అమీర్‌పేటలోని ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ప్రమాదంలో శేషు ఎడమచేతికి గాయమైంది. జబర్దస్త్ టీవీ కార్యక్రమం ద్వారా అతను షేకింగ్ శేషుగా పాపులర్ అయ్యాడు.

Jabardasth Seshu Injured in Supreme Sets!

ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్, రాశి కన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో షేకింగ్ శేషు హాస్యపాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్‌లో కొంత భాగం పూర్తి చేశాడు కూడా.

English summary
Comedian Shaking Seshu, who shot fame with the Jabardasth comedy show, is also now busy with movies in Tollywood. As per the latest reports Seshu met with a car accident in a shooting spot of the movie in Rajasthan.
Please Wait while comments are loading...