»   » జబర్దస్త్ లో బూతులున్నాయ్.., వాళ్ళవల్ల మా పరువు పోతోంది: షేకింగ్ శేషు

జబర్దస్త్ లో బూతులున్నాయ్.., వాళ్ళవల్ల మా పరువు పోతోంది: షేకింగ్ శేషు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈమధ్య సీనియర్ నటుడు చలపతి రావ్ చేసిన వ్యాఖ్యల పుణ్యమా అని టీవీ ప్రోగ్రాం లమీద కూడా వ్యతిరేకత మొదలయ్యింది. ఇన్నాళ్ళూ ఒక రకమైన డైలాగులతో, బూతు పదాలతో కామెడీ అంటూ చేసిన షో లకి తెరపడేదాక వచ్చిందనే వార్తల విషయం నేపథ్యం లో ఒక ఇంటర్వ్యూలో 30 యియర్స్ పృథ్వీ చెప్పిన ఒక ప్రోమో మీద విమర్షలు వెల్లువెత్తాయి... దాని మీద యాంకర్ అనసూయ కూడా వివరణ ఇవ్వల్సి వచ్చింది...

షేకింగ్ షేషు

షేకింగ్ షేషు

ఇప్పుడు అదే ప్రోగ్రాం లో పాల్గొన్న నటుడు షేకింగ్ షేషు కూడా స్పందించాడు... నిజానికి ప్రోగ్రామ్‌లు చేసేవాళ్లు బూతు అని కనిపించగానే దాన్నే ప్రోమోగా పెట్టేస్తున్నారని, దాని వల్ల ఆర్టిస్టుల పరువు పోతోందని శేషు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ‘మీది లేస్తుంది.. నాది పడుకుంటుంది' అన్న ప్రోమోపై శేషు వివరణ ఇచ్చాడు.

బీభత్సమైన వల్గారిటీ ఉంది

బీభత్సమైన వల్గారిటీ ఉంది

ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,‘ '‘జబర్దస్త్' ఫస్ట్ ఎపిసోడ్ లోనే బీభత్సమైన వల్గారిటీ ఉంది. ఈ ఎపిసోడ్ ని చూసిన మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఆనందించారు. దీంతో, టీఆర్ పీ 15..16 కు వెళ్లిపోయింది. ఆ ఒరవడి నుంచి వీళ్లు వెనక్కి రాలేకపోతున్నారు.

టీఆర్ పీ 8..9 కి పడిపోయింది

టీఆర్ పీ 8..9 కి పడిపోయింది

వల్గారిటీ విషయమై బయట నుంచి ఒత్తిడి రావడంతో .. చివరకు మల్లెమాల సంస్థ వారు కంట్రోల్ చేశారు. దీంతో, టీఆర్ పీ 8..9 కి పడిపోయింది. ఎందువల్లా అంటే, ‘బూతు' లేకపోవడం వల్ల. సొసైటీలో చెడు ఎక్కడ ఉందో అక్కడికి ముందుగా, మంచి ఎక్కడ ఉందో అక్కడికి లేటుగా వెళతారు. ప్రోగ్రాం బాగుండక పోవడమనేది ఛానెల్ వాళ్ల తప్పు కాదు .. ప్రేక్షకుల తప్పు...'' అంటూ షేకింగ్ శేషు చెప్పుకొచ్చాడు.

ప్రోగ్రాం మొత్తం చూస్తే తెలుస్తుంది

ప్రోగ్రాం మొత్తం చూస్తే తెలుస్తుంది

ఆ ప్రోమోలో వచ్చిన మాటలకు అర్థం ప్రోగ్రాం మొత్తం చూస్తే తెలుస్తుంది. ప్రోగ్రాం తొలి రౌండ్లో నేను గెలిచాను. కాబట్టి మిగతా కంటెస్టెంట్లకు నేను ఓ టాస్క్ ఇవ్వాలి. వారిని ఓడించాలంటే నేను కష్టమైన టాస్క్ ఇవ్వాలి. అప్పుడు అలీ అనే అబ్బాయికి హిందూ దేవాలయల గురించిన టాస్క్ ఇచ్చాను.

rn

అలా ఇస్తేనే నీ రేటింగ్ పడుకుంటుంది

అప్పుడు ఆ అబ్బాయి ‘ఏంటి బాబాయ్ నాకు హిందూ దేవాలయాల గురించి ఏం తెలుస్తుంది. నేను ముస్లింని కదా' అని అన్నాడు. అప్పుడు అలా ఇస్తేనే నీ రేటింగ్ పడుకుంటుంది.. నా రేటింగ్ లేస్తుంది అని అన్నాను. కానీ, అదంతా కట్ చేసేసి ‘నీది పడుకుంటుంది.. నాది లేస్తుంది' అని ప్రోమోలు వేశారు. సంస్కారం ఉన్నవారెవరైనా అలాంటి పదాలు వాడతారా?'' అని షేకింగ్ శేషు వివరించారు.

English summary
Jabardasth Comedion Sheking Sheshu Opens Up on Anasuya Jacpat Show Promo Controversy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu