»   » చూసినోళ్లందరూ షాక్ , హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ తోనే.... తమన్నా కి ఇంత రేంజ్ ఉందా...!?

చూసినోళ్లందరూ షాక్ , హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ తోనే.... తమన్నా కి ఇంత రేంజ్ ఉందా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభినేత్రి హిందీ వర్షన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్ హీరో జాకీ చాన్ విడుదల చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. నటుడు సోనూ సూద్‌తో కలిసి జాకీ ఈ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రస్తుతం సోనూ సూద్‌తో కలిసి ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు జాకీ. ఆ చనువుతోనే ఇలా అభినేత్రి పోస్టర్ లాంఛ్‌కు జాకీ వచ్చాడట. ఇక ఆగష్టు 15న ఆడియో రిలీజ్ చేసుకొని సెప్టెంబర్ 13న సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆగష్టు 1 న కొత్త టీజర్ ను విడుదల చేస్తున్నారు. ఈ టీజర్ లో తమన్నా చెలరేగి పోతుందంట. ఆగష్టు 15 న ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. సెప్టెంబర్ 13 న సినిమాని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒక రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా మీద తమన్నా చాలా ఆశలే పెట్టుకుంది. ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా ను ఒకేసారి విడుదల చేస్తున్నారు దీంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.... అభినేత్రి చిత్ర విశేషాలు మరికొన్ని స్లైడ్ షో లో...

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా...!?

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా...!?

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్లో ప్రెస్టీజియస్ గా భావిస్తున్న సినిమా ‘అభినేత్రి'. ఒకేసారి తెలుగు-తమిళం-హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. తమ్మూ తొలిసారి దయ్యం పాత్ర చేయడమే కాదు.. ద్విపాత్రాభినయం కూడా చేస్తోంది.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ కాగా చిత్ర యూనిట్ వినూత్న ప్రచారాలు చేస్తోంది. హిందీలో ప్రమోషన్ కోసం బాలీవుడ్ నటుడు సోనూసూద్ హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్‌ని ఆహ్వానించాడు.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

జాకీచాన్ చేతుల మీదుగా టూ ఇన్ వన్ పోస్టర్‌ని లాంచ్ చేయించాడు. జాకీచాన్, సోనూ సూద్‌లు కుంగ్‌ఫూ యోగా అనే హాలీవుడ్ మూవీలో కలిసి నటిస్తోండగా, ఆ రిలేషన్‌తోనే పోస్టర్ లాంచింగ్ కార్యక్రమానికి జాకీ చాన్ వచ్చినట్టు తెలుస్తోంది. మూడు భాషల్లో భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు సమాచారం.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

ఓ పక్కన ప్రభుదేవా.. మరోపక్కన సోనూ సూద్ మధ్యలో హాట్ హాట్ గా కనిపిస్తున్న తమన్నా.. ఆమెలోపలో ట్రెడిషనల్ గా మరో తమన్నా.. మొత్తంగా ఈ పోస్టర్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

ప్రభుదేవ, తమన్నా, సోనూ సూద్ ప్రధాన పాత్రలుగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. తెలుగులో అభినేత్రి టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కానుండగా, హిందీలో టూ ఇన్ వన్, తమిళంలో డెవిల్ పేరుతో విడుదల కానుంది.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

అభినేత్రి హారర్ థ్రిల్లర్ మూవీ అని చిత్రబృందం ముందు నుంచీ చెప్తోంది. తాజాగా ఈ సినిమా కథను హీరో ప్రభుదేవా వివరించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం చుట్టూ కథ ఉంటుందని చెప్పేసాడు.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

ఈ సినిమాలో ప్రభు - తమన్నాలు భార్యాభర్తలుగా కనిపిస్తారట. భార్యను పట్టించుకోకుండా ప్రపంచంలో ఉన్న ఇతర అందాలవైు చూసే భర్తగా ప్రభుదేవా కనిపిస్తాడు.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

హీరో తన భార్య అందాన్ని ఎలా గుర్తించాడన్నదే అసలు పాయింట్ అని ‘అభినేత్రి' కథనం, చిత్రీకరణ విధానం హైలెట్ అవుతాయని ప్రభుదేవా చెప్పాడు.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

ఇండియన్ మైకల్ జాక్సన్‌తో జతకట్టిన కారణమో ఏమోగానీ డ్యాన్సుల్లో తమన్నా చెలరేగిపోతోంది. ఇటీవల ‘అభినేత్రి' సినిమాకి సంబంధించి ఓ డాన్స్ ప్రాక్టీస్ వీడియోని నెటిజన్ల ముందుంచిన మిల్కీ బ్యూటీ అందరిచేత ‘వహ్వా..' అనిపించుకుంది.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తాజాగా అభినేత్రి రెండో టీజర్ విడుదలైంది. ఇందులో తమన్నా డ్యాన్సులు చూసిన ఎవరైనా కాసేపు రెప్ప వేయడం మర్చిపోతారు. ఆ రేంజ్‌లో అదరగొట్టింది ఈ అందాలభామ.

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమన్నా కి ఇంత రేంజ్ ఉందా

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ రయిత కోన వెంకట్ నిర్మించగా, తమిళంలో ప్రభుదేవ, హిందీ వర్షెన్‌కు సోనూ సూద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

English summary
Jackie Chan launched the latest poster of Tamannaah, Prabhu Deva and Sonu Sood starrer Abhinetri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu