»   » సాహోలో జాకీష్రాఫ్: భయపెడుతున్న సెంటిమెంట్, సాహో ఫ్లాప్ అవుతుందా??

సాహోలో జాకీష్రాఫ్: భయపెడుతున్న సెంటిమెంట్, సాహో ఫ్లాప్ అవుతుందా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు ప్రభాస్‌తో ఫైట్లు ఫీట్లు చేయడానికి ముచ్చటగా ముగ్గురున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా చేస్తున్న 'సాహో'లో హిందీ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్, చంకీ పాండేలు విలన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులోకి మరో హిందీ నటుడు చేరారు. ఆయనే... జాకీ ష్రాఫ్‌.

ఇప్పటివరకు జాకీ ష్రాఫ్ నటించిన మూడు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద అణుబాంబులుగా మారతాయనుకుంటే, కనీసం అవి తాటాకు చప్పుడు కూడా చేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాయి. మంచు విష్ణు నటించిన 'అస్త్రం' సినిమా ఒకటి కాగా, మిగతా రెండు స్టార్ హీరోలతో తెరకెక్కించిన పవన్ 'పంజా' మరియు ఎన్టీఆర్ 'శక్తి' చిత్రాలు.

Jackie Shroff joins the cast of Saaho

ఇవన్నీ అతి దారుణ పరాజయాలు చవిచూసాయన్న విషయం తెలియనిది కాదు. దీంతో ప్రభాస్ "సాహో" సినిమాలో జాకీ ష్రాఫ్ ఉన్నాడని వస్తున్న వార్తలు నిజం కాకపోతే బాగుండని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఒక పక్క మేకర్సేమో జాకీ, 'సాహో'లో నటిస్తున్నట్టు కన్ఫర్మ్‌ చేశారు.

ఈ సినిమా గురించి జాకీ ష్రాఫ్‌ మాట్లాడుతూ- ''ఐయామ్‌ హ్యాపీ టు బి పార్ట్‌ ఆఫ్‌ ప్రభాస్‌ 'సాహో'. సినిమాలో కీలక పాత్రను నేను చేయగలనని ప్రభాస్‌ నమ్మాడని తెలిసి ఇంకా సంతోషపడ్డా'' అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌.

English summary
Jackie Shroff will play a suave antagonist in the Sujeeth-directed film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X