For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'జాక్‌పాట్‌' షూటింగ్ స్పాట్ లో...గోపీచంద్‌,తాప్సీ (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: గోపీచంద్‌, తాప్సీ కాంబినేషన్ లో చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొత్తానికి పూర్తైంది. ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్ ని విడుదల చేసారు. వర్కింగ్ స్టిల్స్ చూసిన వారు ఓ గొప్ప ఎడ్వెంచర్ చిత్రం చూడబోతున్నట్లు భావిస్తున్నారు.

  నిధుల అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గోపీచంద్‌ సెక్యూరిటీ గార్డు పాత్రలో కనిపిస్తారు. ''విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటోంది. యాక్షన్‌ ఘట్టాలు మాస్‌ని అలరిస్తాయి. లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌ల్లో చిత్రీకరణ జరిపాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

  ''విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకొంటోంది. యాక్షన్‌ ఘట్టాలు మాస్‌ని అలరిస్తాయి. లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌ల్లో చిత్రీకరణ జరిపాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మెకన్నాస్ గోల్డ్ తరహా కథాంసంతో గోపీచంద్ కెరీర్ లో నెంబర్ వన్ గా నిలవనుందని చెప్తున్నారు.

  ఈ చిత్రంలో గోపీచంద్ ఎటిఎం సెంటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా కనపించనున్నాడని సమాచారం.

  ‘ఒక్కడున్నాడు' తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపిచంద్ ఈ సినిమా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

  ఇందులో తాప్సీ హీరోయిన్ . గోపీతో కలిసి ఇంతకుముందు తాప్సీ ‘మొగుడు' సినిమా చేశారు.

  రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేసారు. దాంతో టాకీ ఆల్ మోస్ట్ ఫినిష్ అయినట్లు చెప్తున్నారు. త్వరలో కడప జమ్మల మడుగులో ఈచిత్రానికి సంభందించి ప్యాచ్ వర్క్ చేస్తారు.

  దర్శకుడు మాట్లాడుతూ -‘‘తీవ్రవాద నేపథ్యంలో గుప్త నిధుల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఇందులో సుమన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. విలన్‌గా శక్తికపూర్ నటిస్తున్నారు'' అని చెప్పారు.

  చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ- ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఓ దేశం నుండి ఓ సామాన్యుడు సాహసోపేతంగా నిధిని ఎలా సాధించాడన్నదే ఈ చిత్రం కధాంశమని చెప్పారు.

  అడ్వెంచరస్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని జోర్డాన్, రాజస్థాన్, లడఖ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని, ఈ కాలానికి తగ్గట్టుగా ‘ట్రెజర్ హంట్' కథను సరికొత్తగా చిత్రంలో చూపిస్తామని, తాను ఇదివరకుచేసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చంద్రశేఖర్ అంటున్నారు.

  హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు అన్నారు.

  అలాగే కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది అని గోపీచంద్ చెప్పారు.

  నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాం'' అని తెలిపారు.

  గోపీచంద్,తాప్సీ లపై బుష్ కషి సీక్వెన్స్ లను లఢక్ లో చిత్రీకరించారు. బుష్ కషి అనేది ఆప్ఘనిస్ధాన్ లో పాపులర్ ఆట. ఈ ఆట ప్రకారం చనిపోయిన మేక శరీరాన్ని గుర్రాలపై రైడ్ చేస్తూ గోల్ లైన్ వైపు ఎవరు విసురుతారు అన్నట్లుగా సాగుతుంది. ఈ ఎపిసోడ్ చిత్రంలో చిత్రంలో హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

  ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

  English summary
  Chandrasekhar Yeleti's upcoming action adventure film starring Gopichand and Tapsi shooting is nearing completion. The final schedule began recently in Hyderabad and the talkie part is almost complete.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X