»   » ఆ హీరోతో నాకున్నది అలాంటి రిలేషనే.. హీరోయిన్ ఖుల్లంఖుల్లా..

ఆ హీరోతో నాకున్నది అలాంటి రిలేషనే.. హీరోయిన్ ఖుల్లంఖుల్లా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో హాట్ హాట్ హీరోయిన్లలో జాక్వెలిన్ ఫెర్రాండెజ్ ఒకరు. మోతాదు మించి అందాలు ఆరబోసినా అదృష్టం మాత్రం అంతంతా మాత్రమే. సల్మాన్ లాంటి అగ్రహీరోలతో కలిసి నటించినా పెద్దగా అవకాశాలు, స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. కానీ వివాదాలు ఆమెను ఎప్పుడూ వెన్నంటి ఉంటాయి. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాక్వెలిన్‌ హీరోయిన్‌గా కన్నా ఐటెంగర్ల్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకోగలిగింది. ఇప్పుడిప్పుడే ఆమెను మంచి పాత్రలు వెతుక్కొంటూ వస్తున్నాయి.

నటిస్తే ఆ సంబంధం ఉన్నట్లేనా..

నటిస్తే ఆ సంబంధం ఉన్నట్లేనా..

ప్రస్తుతం జంటిల్మన్ చిత్రం చేస్తున్నాను. సినిమా కథ విన్నప్పుడే మంచి విజయాన్ని అందుకుంటుంది అనిపించింది. ఫస్ట్‌ పోస్టర్‌ విడుదలైన తరువాత ఆ నమ్మకం మరింత పెరిగింది అని అన్నారు. సిద్ధార్థ్‌ నేను ‘జెంటిల్మన్‌'లో కలిసి నటిస్తున్నంత మాత్రాన తనకూ నాకూ మధ్య రిలేషన్‌షిప్‌ ఉందనడం ఎంత వరకూ సమంజసం అని ఆమె ప్రశ్నించారు.

నాకు అతనితో అలాంటి రిలేషన్

నాకు అతనితో అలాంటి రిలేషన్

ఆలియా, సిద్ధార్థ్‌ల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తెలియదు. సిద్ధార్థ్‌ నాకు మంచి స్నేహితుడు మాత్రమే వృత్తిపరంగా తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. వారిద్దరి మధ్య గొడవలకు నేను కారణం కాదు అని జాక్వెలిన్ పేర్కొన్నది.

 తాప్సీకి నాకు గొడవలు లేవు

తాప్సీకి నాకు గొడవలు లేవు

జుడ్వా 2 చిత్రంలో తాప్సీ పొన్ను కలిసి నటిస్తున్నాను. తనకు గొడవలు లేవు. అలాంటి వార్తలో వాస్తవం లేదు. ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుడుతాయో తెలియదు. తాప్సీకి నాకు మధ్య సీన్లు కూడా చాలా తక్కువే అని జాక్వెలిన్ అన్నారు.

చేయాలనిపిస్తేనే ఐటెంసాంగ్స్..

చేయాలనిపిస్తేనే ఐటెంసాంగ్స్..

ఐటెంసాంగ్స్‌ గానీ, స్పెషల్ సాంగ్స్‌ అయినా నాకు చేయాలని అనిపిస్తే చేస్తాను. అంతేకానీ అన్ని సినిమాల్లో చేయను. గతంలో రెండు, మూడు చిత్రాల్లో మాత్రమే చేశాను. వాటికి మంచి పేరు వచ్చింది. అలా అని వాటికే పరిమితం కాదలచుకోలేదు అని జాక్వెలిన్ పేర్కొన్నది.

English summary
jacqueline fernandez cleared the air that .. I dont have affair with sidharth Malhotra. I am not reason behind sidharth, Alia's split. I dont have any issues with Tapsee ponnu too.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu