»   » వైరల్ : శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లిన ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..తిట్టి పోస్తున్నారు!

వైరల్ : శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లిన ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..తిట్టి పోస్తున్నారు!

Subscribe to Filmibeat Telugu
Jacqueline Fernandez Shocking Performance At Sridevi Last Rites

శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో అభిమానులు, కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయుల సమక్షంలో జరిగాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మరియు కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలనుంచి అతిరథ మహారధులంతా శ్రీదేవి అంత్యక్రియలకు హాజరయ్యారు. శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు తెలిపారు. శ్రీదేవి జీవితం అకస్మాత్తుగా ముగియడం ఎవరూ జీర్ణించుకోలేని విషయం.

ఇప్పుడే ఎదుగుతున్న తన ఇద్దరు కుమార్తెలని వదలిపెట్టి శ్రీదేవి వెళ్లిపోవడం అందరిని కలచివేసింది. కొంత మంది శ్రీదేవి పార్థివదేహానికి నివాళులు అర్పించిన తరువాత కన్నీటి పర్యంతం అయ్యారు. మరికొంత మంది ప్రముఖులు మౌనంగా బాధతో వెళ్లిపోయారు. కానీ శ్రీదేవి అంత్యక్రియల సందర్భంగా శ్రీలంక సుందరి జాక్వలిన్ ఫెర్నాండేజ్ కనిపించిన తీరు శ్రీదేవి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

కదలిన సినీలోకం

కదలిన సినీలోకం

అతిలోక సుందరి కోసం బుధవారం సినీలోకం మొత్తం కదిలింది. భాదతో కూడుకున్న హృదయాలతో శ్రీదేవికి అంతిమ వీడ్కోలు పలికారు. శ్రీదేవిని అంత్యక్రియలకు తరలించే రోడ్లు మొత్తం అభిమానులతో నిండిపోయాయి.

 అశ్రునయనాలతో

అశ్రునయనాలతో

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల ప్రముఖులు శ్రీదేవి అంతమా యాత్రకు హాజరయ్యారు. శ్రీదేవితో నటించిన, పరిచయం ఉన్న నటులంతా అశ్రునయనాలతో ఆమెకు నివాళులు అర్పించారు. కొందమంది ప్రముఖులైతే శ్రీదేవి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తరువాత పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయి కన్నీటి పర్యంతం అయ్యారు.

ఆశ్చర్యం కలిగించిన జాక్వెలిన్ ప్రవర్తన

ఆశ్చర్యం కలిగించిన జాక్వెలిన్ ప్రవర్తన

అంతులేని భావోద్వేగాలతో కూడుకున్న ప్రదేశంలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ప్రవర్తన నెటిజన్లకు, శ్రీదేవి అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. జాక్వెలిన్ కూడా బుధవారం శ్రీదేవి పార్థివ దేహానికి నివాళులు అర్పించింది.

 నవ్వుతూ కనిపించడానికి కారణం

నవ్వుతూ కనిపించడానికి కారణం

జాక్వెలిన్ శ్రీదేవి పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి వెళుతుండగా నవ్వుతూ ఎంజాయ్ మూడ్ లో కనిపించింది. దీనికి కారణం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. శ్రీదేవి అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విమర్శల వర్షం

విమర్శల వర్షం

శ్రీదేవికి నివాళులు అర్పించాడనికి వెళుతున్న జాక్వెలిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోని షేర్ చేస్తున్న నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వేరేలా కొందరి వాదన

వేరేలా కొందరి వాదన

శ్రీదేవికి దుఃఖంతో వీడ్కోలు పలకడం జాక్వెలిన్ కు ఇష్టం లేదేమో.. అందుకే చిరునవ్వుతో సాగనంపాలని అలా కనిపించి ఉంటుందని కొందరు పాజిటివ్ గా తీసుకుంటున్నారు.

English summary
Jacqueline Fernandez laughing at Sridevi funeral. Jacqueline gets trolled in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu