»   » హీరోయిన్ షాకింగ్ సాహసం: వేల్ షార్క్ తో కలిసి స్విమ్ చేస్తూ.. (ఫోటోస్)

హీరోయిన్ షాకింగ్ సాహసం: వేల్ షార్క్ తో కలిసి స్విమ్ చేస్తూ.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిన్న మొన్నటి వరకు తన తాజా హిందీ మూవీ 'డిష్యుం' ప్రమోషన్లలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా రిలీజ్ కావడం, హిట్ టాక్ తెచ్చుకోవడంతో చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఖాళీ సమయం చిక్కడంతో తన తల్లితో కలిసి మాల్దీవులు వెకేషన్లో గడుపుతోంది.

మాల్దీవుల్లోని అందమైన బీచుల్లో విహరించడమే కాదు... ఒళ్లు గగుర్బొడిచే సాహసాలు సైతం చేస్తోంది. జాక్వెలిన్ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో చూసి అభిమానులు షాకయ్యారు. సముద్ర గర్బంలో స్కూబా డైవింగ్ చేస్తూ ఏకంగా వేల్ షార్క్ తో కలిసి స్విమ్ చేస్తున్న ఫోటోను జాక్వెలిన్ పోస్టు చేసింది.

అంతే కాదు... సముద్ర జలాలను కలుషితం చేయవద్దని, సముద్ర జీవులకు హాని కలిగించే పనులు చేయొద్దని మెసేజ్ ఇస్తోంది. వేల్ షార్క్ తో కలిసి స్విమ్ చేయడం మరిచిపోలేని అనుభూతి అంటూ తన ఎగ్జైటింగ్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంది.

స్లైడ్ షోలో జాక్వెలిన్ వేల్ షాక్క్ తో కలిసి స్విమ్ చేసిన ఫోటోలు, మాల్దీవులు వెకేషన్ కు సంబంధించిన ఫోటోస్...

వేల్ షార్క్ తో కలిసి జాక్వెలిన్

వేల్ షార్క్ తో కలిసి జాక్వెలిన్

మాల్దీవులు సముద్ర గర్భంలో వేల్ షార్క్ తో కలిసి స్విమ్ చేస్తున్న జాక్వెలిన్.

తల్లితో కలిసి..

తల్లితో కలిసి..

మాల్దీవుల్లో తన తల్లితో కలిసి నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న జాక్వెలిన్.

సూపర్ హాట్ లుక్

సూపర్ హాట్ లుక్

ఇటీవల విడుదలైన డిష్యుం మూవీలో జాక్వెలిన్ సూపర్ హాట్ లుక్ తో అభిమానులను ఎంటర్టెన్ చేసింది.

హ్యాపీ మూమెంట్స్

హ్యాపీ మూమెంట్స్

మాల్దీవుల్లో తన తల్లితో కలిసి గడుపుతున్న హ్యాపీ మూమెంట్స్ అభిమానులతో షేర్ చేసుకుంది.

సముద్రంలో..

సముద్రంలో..

సముద్రంలో గడపటం అంటే జాక్వెలిన్ కు చాలా ఇష్టం.

English summary
Jacqueline Fernandez took off with her mother for a quick vacation in Maldives. The actress swam alongside the whale shark and also went snorkelling.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu