»   » ఈ హీరోయిన్ వర్కౌట్స్ చూస్తే షాకవ్వాల్సిందే (వీడియో)

ఈ హీరోయిన్ వర్కౌట్స్ చూస్తే షాకవ్వాల్సిందే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో సెటిలైన శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.....శరీరాకృతి చాలా అందంగా, సెక్సీగా ఉంటుంది. బాలీవుడ్లో ఫిట్ గా ఉండే హీరోయిన్లలో ఆమె టాప్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన డాన్స్ స్టెప్పులతో పలు సందర్భాల్లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది కూడా. రాయ్ సినిమాలో బీచ్ ఒడ్డు ఆమె పెర్ఫార్మెన్స్ కేక.

తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో షేర్ చేసింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో అది. ఆమె ఎంత ఫ్లెక్సిబుల్ బాడీ కలిగి ఉందో, తన బాడీని అలా ఉంచుకోవడానికి ఎంత కష్టపడుతుందో ఈ వీడియో చూస్తే స్పష్టమవుతుంది. సాధారణ వ్యక్తులు ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Jacqueline Fernandez Works Out Like A Monster

శ్రీలంక జాతీయురాలైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్... అలాడిన్ చిత్రం ద్వారా బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించింది. అయితే ఈ చిత్రం ఆమెకు పెద్దగా పేరు తేలేదు. తర్వాత మర్డర్ 2, రేస్ 2తో పాటు పలు చిత్రాల్లో నటించింది. ఆమె కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ సల్మాన్ ఖాన్ కు జోడీగా నటించిన ‘కిక్'.

ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలు హిందీ చిత్రాలతో పాటు ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ చిత్రం ‘బ్రదర్స్'తో పాటు, టైగర్ ష్రాఫ్ కు జోడీగా ‘ఫ్లైయింగ్ జాట్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు డెఫినెషన్ ఆఫ్ ఫియర్ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

English summary
Jacqueline Fernandez, who has an extremely toned body, is undoubtedly one of the fittest actresses of Bollywood. The diva has impressed us with her dance moves several times; remember her sizzling moves at a beach in the film Roy? Now, Jacqueline has shared an Instagram video on Twitter in which the actress is seen working out at a gym and her flexibility will just make you awestruck.
Please Wait while comments are loading...