నాగ శౌర్య ‘జాదూగాడు’ ఫస్ట్ లుక్
హైదరాబాద్: ‘ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా', ‘లక్ష్మి రావు మా ఇంటికి' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య...త్వరలో ‘జాదూగాడు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత వీ.వీ.ఎస్.ప్రసాద్ సత్యా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ‘చింతకాయల రవి' చిత్ర దర్శకుడు యోగేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ విడుదల చేశారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.



Click it and Unblock the Notifications











