»   » శృంగార భంగిమ: ‘జాదూగాడు’ న్యూ పోస్టర్ అదిరింది

శృంగార భంగిమ: ‘జాదూగాడు’ న్యూ పోస్టర్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ శౌర్య హీరోగా యోగేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాదూగాడు'. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదైలంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ ఒకటి విడుదల చేసారు. బీచ్ ఒడ్డున శృంగార భంగిమను తలపించే విధంగా ఉన్న ఈ పోస్టర్ యువతను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా ద్వారా టీవీ నటి ‘సోనారిక' హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘హర హర మహదేవ' టీవీ సీరియల్‌లో పార్వతి పాత్రదారిణి. ఆమె తెలుగు మూవీ ‘జాదూగాడు'లో హీరోయిన్ గా ఎంపికయింది. నాగ శౌర్యకు తగిన జోడీ కావడంతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగా పండుతుందని ఆశిస్తున్నారు.

'Jadoogadu' hot poster

జాదూగాడు సినిమా విషయానికొస్తే....ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా', ‘లక్ష్మి రావు మా ఇంటికి' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య...త్వరలో ‘జాదూగాడు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత వీ.వీ.ఎస్.ప్రసాద్ సత్యా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

‘చింతకాయల రవి' చిత్ర దర్శకుడు యోగేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ విడుదల చేశారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

English summary
Hara Hara Mahadev serial fame Sonarika paired up with Naga Shaurya for a film titled 'Jadoogadu'. 'Chintakayala Ravi' fame Yogesh is the director and V.V.N.Prasad is producing the film on Sathyaa Entertainments banner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu